చరణ్, కీర్తి మధ్య సూపర్ కెమిస్ట్రీ, జంటగా సినిమా ఎప్పుడో మరి

Ramcharan and Keerthy Suresh | ఫస్ట్ టైమ్ మీటింగ్ లోనే సూపర్బ్ అన్ స్టేజ్ కెమిస్ట్రీ చూపించారు రామ్ చరణ్, కీర్తి సురేష్. రీసెంట్ గా కీర్తి నటించిన గుడ్ లక్ సఖి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రామ్ చరణ్. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రావాల్సింది. ఆయనకు కోవిడ్ పాజిటివ్ రావడం వల్ల రామ్ చరణ్ ఆ బాధ్యత తీసుకున్నాడు. ఏదో వచ్చాడని అనిపించకుండా గుడ్ లక్ సఖి టీమ్ మొత్తాన్ని మనస్ఫూర్తిగా అభినందించాడు. నాయిక కీర్తి సురేష్ ను పొగడ్తలతో ముంచెత్తాడు రామ్ చరణ్.
మహానటి కీర్తి సురేష్ నటించాక, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాక గుడ్ లక్ సఖి చిన్న సినిమా ఎందుకు అవుతుందని, ఇది పెద్ద సినిమానేనని రామ్ చరణ్ అన్నాడు. కీర్తి సురేష్ అటు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే ఇటు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోందని, ఆమె తన కెరీర్ ను ఇలాగే కొనసాగించాలని రామ్ చరణ్ కోరారు. చరణ్ పొగడ్తలకు మైమరచి పోయిన కీర్తి అతనితో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు స్టెప్పులు వేసింది. స్టేజీ మీద ఉన్నంత సేపు వీళ్లిద్దరు ఒకరి మీద మరొకరు చూపించిన అఫెక్షన్ అందరినీ ఆకట్టుకుంది. త్వరలో వీళ్లు కలిసి ఓ సినిమా చేస్తే ఇంకా బాగుంటుందని అనుకోని వారుండరు. అలాంటి ఓ క్రేజీ ప్రాజెక్ట్ కీర్తి, చరణ్ కాంబోలో వస్తే ఫిల్మ్ లవర్స్ కు ట్రీటే కదా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

