Nepal Floods: గుర్తుతెలియని మృతదేహాలకు తాత్కాలిక ఖననం.. 1127కు చేరిన నేపాల్ వరద మృతుల సంఖ్య
Nepal Floods: నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతిచెందిన వారి సంఖ్య 1127కు చేరుకున్నది. ఇంకా 4 వేల మంది మిస్సింగ్‌లో ఉన్నారు. ఇక గుర్తు తెలియని శవాలను పాక్షికంగా పాతి పెడుతున్నారు. ఆ మృతదేహాల డీఎన్ఏ శ్యాంపిళ్లను సేకరిస్తున్నారు.
కాట్మాండు: నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతిచెందిన వారి సంఖ్య 1127కు చేరుకున్నది. మరో వైపు 4 వేల మంది మిస్సింగ్‌లో ఉన్నారు. వారి కోసం ఇంకా గాలింపు కొనసాగుతున్నది. ఆగస్టు 26వ తేదీన సంభవించిన జలవిలయంలో మరణించిన వారి మృతదేహాలకు తాత్కాలిక ఖననం చేస్తున్నారు. గుర్తు తెలియని మృతదేహాలను పాతిపెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ జరుగుతోంది. కాట్మాండులోని గోకర్ణలో కూడా శవాలను పాక్షిక ఖననం చేస్తున్నారు. అయితే శవాలను పాతిపెట్టడానికి ముందు.. వారి డీఎన్ఏ శ్యాంపిళ్లను, ఫోటోగ్రాఫ్‌లను, ఇతర గుర్తుపట్టే సమాచారాన్ని భద్రపరుస్తున్నారు. ఆ మృతుల కుటుంబీకులు అంతిమ సంస్కారం నిర్వహించేందుకు ఈ పద్ధతి వీలుగా ఉంటుందని భావిస్తున్నారు.
నేపాలీ పోలీసుల ప్రకారం 348 మృతదేహాలను చిత్వాన్ నుంచి రికవరీ చేశారు. 217 నావల్పారసి ఈస్ట్ నుంచి, 190 నావల్పారసి వెస్ట్, నువాకోట్ నుంచి 155 మంది, గోర్కా నుంచి 66, దాడింగ్ నుంచి 59, రసువా నుంచి 45, తానాహు నుంచి 36 మంది మృతదేలను వెలికితీశారు. సుమారు 1113 మృతదేహాలకు పోస్టుమార్టమ్, లీగల్ ఐడెంటిఫికేషన్ పూర్తి అయినట్లు పోలీసులు చెప్పారు. ఇక 95 మంది మృతదేహాలను బంధువులకు అప్పగించారు. గుర్తు తెలియని 911 మృతదేహాల వివరాలను నేపాల్ పోలీసులు తమ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు.
సెక్యూర్టీ దళాలు ఇప్పటి వరకు 6541 మందిని రెస్క్యూ చేశారు. మరో 4858 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

