ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.గతేడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రంలో బన్నీ తన యాక్టింగ్ తో తెలుగుతో పాటు హిందీలో కూడా కలెక్షన్ల సునామీని సృష్టించాడు. దీనికి పోటీగా స్పైడర్‌మ్యాన్ నో వే హోమ్, 83 సినిమాలు విడుదలైన వీటి ప్రభావం పుష్ప పై ఏ మాత్రం పడలేదు. కాగా పుష్ప సినిమా విడుదలైన మూడు వారాలలోపే అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో విడుదలైంది. హిందీ వెర్షన్ మాత్రం జనవరి 14న విడుదలై డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో కూడా మంచి వ్యూవర్ షిప్‌ను సాధించింది.
ఇదిలా ఉంటే పుష్ప చిత్రం ఇప్పటికీ థియేటర్లలో మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.ఇక తాజాగా రిపబ్లిక్ డే రోజు కూడా ఈ చిత్రం హిందీలో కోటీన్నర పైగా వసూళు చేసి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పుష్ప చిత్రం హిందీలో డిజిటల్ స్ట్రీమింగ్ అయినప్పటినుంచి ఇప్పటివరకు ఏకంగా 15కోట్ల షేర్ ను వసూళు చేసి రికార్డ్ సృష్టించింది. దీంతో హిందీలో మరో రెండున్నర కోట్ల షేర్ ను కలెక్ట్ చేస్తే 100 కోట్ల షేర్‌ను సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టిస్తుంది. పుష్ప క్రేజ్ ఇప్పుడు దేశాలను సైతం దాటిపోయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప రీల్స్, వార్తలే వినబడుతున్నాయి. ఇక పుష్ప కు వచ్చిన ఓవరాల్ కలెక్షన్లను చూసుకుంటే దాదాపుగా 34 కోట్ల ప్రాఫిట్ ను సాధించింది.