Narendra Modi | పవన్ కళ్యాణ్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు.. వైరల్ అవుతున్న ట్వీట్
Narendra Modi | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
Narendra Modi | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ చేసిన పోస్ట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, జనసేన అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. ఆయనకు ప్రజల్లో ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజలతో మమేకమవుతూ, సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు.
అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చేపడుతున్న సుపరిపాలన కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ మరింత వేగం తీసుకురావడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తన బాధ్యతల్లో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాలకు మరింత ఊతమిస్తున్నారని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజల్లో విస్తృతమైన ఆదరణ, గౌరవాన్ని సంపాదించుకున్న నాయకుడిగా మోదీ అభివర్ణించడం విశేషంగా మారింది. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ స్థాపన నుంచి ప్రజా సమస్యలపై పోరాడుతూ తనకంటూ ప్రత్యేక రాజకీయ గుర్తింపును ఏర్పరుచుకున్నారు.
పవన్ కళ్యాణ్‌కు దీర్ఘాయుష్షుతో పాటు మంచి ఆరోగ్యం కలగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. సమాజ సేవలో ఆయన మరింత కాలం కొనసాగాలని కోరుకున్నారు. సమాజ సేవలో కొనసాగుతూ పవన్ కళ్యాణ్‌కు సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితం లభించాలని కోరుకుంటున్నాను అనే భావాన్ని వ్యక్తం చేస్తూ ప్రధాని తన బర్త్‌డే విషెస్‌ను తెలిపారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో పవన్‌కు సంబంధించిన పోస్టులు, ఫొటోలు, వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ స్వయంగా పవన్ కళ్యాణ్‌ను ప్రశంసిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జనసేన శ్రేణుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పాత్రను ప్రస్తావిస్తూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.@PawanKalyan
— Narendra Modi (@narendramodi) September 2, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

