Anu emmanuel in Mahesh babu Movie | సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. సమ్మర్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే సర్కారు వారి పాట సెట్స్ పై ఉన్నప్పుడే త్రివిక్రమ్ సినిమా కూడా ఖరారు చేశాడు మహేశ్ బాబు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా పూర్తి కావడంతో.. సూపర్ స్టార్ సినిమాపై ఫోకస్ చేశారు మాటల మాంత్రికుడు. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటు మహేశ్ బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ప్రొడక్షన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్.
అరవింద సమేత నుంచి ఆమెకు వరుసగా అవకాశాలు ఇస్తున్నాడు త్రివిక్రమ్. హీరోయిన్స్‌ను రిపీట్ చేయడం త్రివిక్రమ్ అలవాటు. ఇలియానా, సమంత విషయంలో ఇదే చేశాడు ఈ దర్శకుడు. ఇప్పుడు పూజా హెగ్డేకు కూడా వరుసగా అవకాశాలు ఇస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈయన సినిమాల్లో ప్రాధాన్యత ఉన్నా లేకపోయినా కచ్చితంగా సెకండ్ హీరోయిన్ ఉంటుంది. జల్సాలో పార్వతి మిల్టన్, అత్తారింటికి దారేది సినిమాలో ప్రణీత, అరవింద సమేత లో ఈషా రెబ్బా, అల వైకుంఠపురములో.. సినిమాలో నివేదా పేతురేజ్.. ఇలా ప్రతి సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉంటుంది. ఇప్పుడు మహేశ్ బాబు సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ ఉంటుందట.
సిస్టర్ సెంటిమెంట్‌తో వస్తున్న ఈ సినిమాలో మహేశ్ బాబు చెల్లెలిగా సాయిపల్లవి నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేశ్‌కు ఓ మరదలు కూడా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేశ్ పాత్ర కోసం వకీల్‌సాబ్ ఫేమ్ అనన్య నాగళ్ల, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ పేర్లు బలంగా వినిపించాయి. భీమ్లా నాయక్‌లో రానా భార్యగా నటిస్తున్న సంయుక్త మీనన్‌ను ఎంపిక చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ వాళ్లెవరూ కాదని.. ఇప్పుడు అజ్ఞాతవాసి సినిమా హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ పేరు వినిపిస్తుంది. ఎలాగూ త్రివిక్రమ్ సినిమాలో కనిపించింది కాబట్టి కచ్చితంగా ఆమెను రిపీట్చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా అను ఇమ్మాన్యుయెల్ కూడా అల్లుడు అదుర్స్, మహాసముద్రం వంటి సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసింది. దీంతో త్రివిక్రమ్ సినిమాలో కూడా అను సపోర్టింగ్ రోల్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Mahesh babu |మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో సర్ ప్రైజింగ్ విలన్..
Anu Emmanuel | కొంటె చూపుతో కవ్విస్తున్న అను ఇమ్మాన్యుయేల్..
మహేశ్ బాబు చెల్లిగా సాయి పల్లవి.. కాంబినేషన్ అదుర్స్ కదూ..
Anu Emmanuel: అందాల డోస్ పెంచిన అను ఇమ్మాన్యుయేల్..
Sai Pallavi | చూపులతో చంపేస్తున్న సాయిపల్లవి..