Mahesh babu |మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో సర్ ప్రైజింగ్ విలన్..

Mahesh babu | తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మ్యాజికల్ కాంబినేషన్స్లో మహేశ్ బాబు, త్రివిక్రమ్ కూడా ఒకటి. ఈ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ సినిమాలు రాలేదు కానీ గుర్తుండిపోయే సినిమాలు మాత్రం వచ్చాయి. అతడు కానీ.. ఖలేజా కానీ ఈ రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టాయి అనలేరు. అలాంటి క్లాసిక్స్ ఈ కాంబినేషన్లో వచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఇద్దరూ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. అది కూడా దాదాపు 11 ఏళ్ల తర్వాత. దాంతో అంచనాలు ఎలా ఉంటాయనేది అర్థం చేసుకోవచ్చు.
మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేదు. టీవీలో మాత్రం చరిత్ర సృష్టించాయి. మహేశ్ బాబు మార్కెట్ తో పనిలేకుండా అతడు సినిమాకు ఆ రోజుల్లోనే రూ.20 కోట్లకు పైగా ఖర్చు చేయించాడు త్రివిక్రమ్. రూ.16 కోట్ల బిజినెస్ చేస్తే 17 కోట్లు వసూలు చేసింది. కానీ నిర్మాత మురళీమోహన్ మాత్రం నష్టపోయాడు. ఆ తర్వాత డిజిటల్ రైట్స్ బాగా రావడంతో ఆయన గట్టెక్కాడు. ఖలేజా విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు. 40 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దారుణంగా నిరాశ పరిచింది. షూటింగ్ చేసిన చాలా సన్నివేశాలు ఎడిటింగ్ రూమ్ లో లేపేశారు. అలా కూడా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది.ఈ సారి అలాంటి తప్పు జరగకుండా త్రివిక్రమ్ ముందు నుంచి జాగ్రత్త పడుతున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాను వీలైనంత తక్కువ బడ్జెట్లో పూర్తి చేయాలని చూస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ చిత్రం గురించి తాజా అప్ డేట్స్ బయటికు వచ్చాయి. ఇందులో విలన్గా బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన క్యారెక్టర్ విభిన్నంగా ఉంటుందని.. త్రివిక్రమ్ కొత్తగా డిజైన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మే నుంచి షూటింగ్ మొదలు పెడుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Bangarraju Collections | బంగార్రాజు ఎంత బాకీ ఉన్నాడు.. ఎంతొస్తే హిట్ అవుతుంది?
మహేశ్ బాబు చెల్లిగా సాయి పల్లవి.. కాంబినేషన్ అదుర్స్ కదూ..
మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు గురించి ఈ విషయాలు తెలుసా!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

