Bangarraju Collections | బంగార్రాజు ఎంత బాకీ ఉన్నాడు.. ఎంతొస్తే హిట్ అవుతుంది?

Bangarraju Collections | నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించిన సినిమా బంగార్రాజు. మొన్న సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా అద్భుతమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంది. మొదటి నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.55 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఆ తర్వాత మాత్రం ఊహించని విధంగా బంగార్రాజు కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. ముఖ్యంగా ఏపీలో నైట్ కర్ఫ్యూ విధించడంతో పాటు.. థియేటర్లలో 50% ఆక్యుపెన్సీ ఈ ఆంక్షలు విధించడం కూడా సినిమా కలెక్షన్స్ పై దారుణమైన ప్రభావం చూపించింది. మరోవైపు తెలంగాణలో టికెట్ రేట్స్ బాగానే ఉన్నా.. కరోనా కేసులు పెరగడం సినిమాకు ప్రతికూలంగా మారింది.
జనవరి 14న విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 9 రోజుల్లో 34.63 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే మరో 5 కోట్లు వసూలు చేయాలి. నాగార్జున కెరీర్లో హైయెస్ట్ బిజినెస్ చేసింది బంగార్రాజు. సంక్రాంతికి పెద్ద సినిమాలు లేకపోవడంతో భారీ రేట్లకు ఈ సినిమాను అమ్మారు. దానికి తగ్గట్లుగానే ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. దాంతో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అందరూ అనుకొన్నారు.. కానీ 5 రోజుల తర్వాత కలెక్షన్స్ పడిపోవడంతో ఇప్పటి వరకు ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. నైజాంలో 11 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే ఇప్పటివరకు కేవలం 7.79 కోట్లు మాత్రమే వచ్చాయి.
మిగిలిన ఏరియాల్లో కూడా కొంత వెనుకబడి ఉన్నాడు బంగార్రాజు. సీడెడ్, కృష్ణా, ఉత్తరాంధ్ర, గుంటూరు ఏరియాల్లో ఇప్పటికే మంచి లాభాలను అందుకుంది బంగార్రాజు. కానీ తెలంగాణలో మాత్రం 4 కోట్లు వెనకబడి ఉంది. కర్ణాటక, ఓవర్సీస్ లోనూ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. సెకండ్ వీకెండ్ ఎలా వసూలు చేస్తుంది అన్న దాన్ని బట్టి ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Naga chaitanya | కళ్లతోనే మాయ చేస్తున్న నాగచైతన్య
హాట్రిక్ కొట్టిన బేబమ్మ.. గోల్డెన్ లెగ్ అయిపోయిన కృతి శెట్టి..
Samantha | పుష్ప తర్వాత సమంత మరోసారి ఐటెం సాంగ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?
Kalyan Krishna | బంగార్రాజు దర్శకుడికి నాగార్జున చివాట్లు.. అసలు కారణం ఇదే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

