Kalyan Krishna | బంగార్రాజు దర్శకుడికి నాగార్జున చివాట్లు.. అసలు కారణం ఇదే..

Kalyan Krishna | అదేంటి.. హిట్ ఇచ్చిన దర్శకుడిని నాగార్జున ఎందుకు తిడతాడు.. పైగా అక్కినేని హీరోలకు ఒకటి రెండు కాదు ఏకంగా మూడు మంచి సినిమాలు ఇచ్చాడు కళ్యాణ్ కృష్ణ కురసాల. ఆయన కెరీర్లో ఉన్న మూడు విజయాలు అక్కినేని హీరోలతో చేసినవే. సోగ్గాడే చిన్నినాయన సినిమాతో దర్శకుడిగా మారిన ఈయన.. రారండోయ్ వేడుక చూద్దాం, మొన్న బంగార్రాజు సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు. మధ్యలో రవితేజతో చేసిన నేల టిక్కెట్టు మాత్రమే అంచనాలను అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే తాజాగా బంగార్రాజు సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న కళ్యాణ్ కృష్ణ ఒక షాకింగ్ విషయాన్ని మీడియా ముందు చెప్పాడు.
తనను నాగార్జున ఒక సందర్భంలో పిలిచి చివాట్లు పెట్టాడు అని.. అది తాను ఎప్పటికీ మర్చిపోలేను అంటున్నాడు కళ్యాణ్. సోగ్గాడే చిన్నినాయన సినిమా పూర్తయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లోనే నాగ చైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా చేశాడు కళ్యాణ్. ఇది కూడా సూపర్ హిట్ అయింది. అయితే ఆ సమయంలో అనుకున్న దానికంటే షూటింగ్ కాస్త లేట్ అయింది. అలా ఎందుకు జరిగింది అని నాగార్జున పిలిచి అడిగినప్పుడు.. కొందరి తప్పులు తాను కవర్ చేయాలని చూడటంతో తిట్టేశాడని చెప్పుకొచ్చాడు కళ్యాణ్ కృష్ణ.
వాళ్లు చేసిన తప్పులు నువ్వు ఎందుకు కవర్ చేస్తున్నావ్.. అలా చేస్తే సినిమాపై ప్రభావం పడుతుంది.. ఆలస్యమవుతుంది కదా ఇంకెప్పుడూ ఇలా చేయకు అంటూ సీరియస్ గా తనకు చెప్పాడని.. అప్పటినుంచి ఇంకొకరి తప్పులు కవర్ చేయడానికి తాను ఎప్పుడూ చూడలేదు అంటున్నాడు కళ్యాణ్ కృష్ణ కురసాల. ఇక బంగార్రాజు సినిమా గురించి మాట్లాడుతూ ముందు నుంచి ఇది పండగ బరిలో దింపాలని అనుకున్నట్లు చెప్పాడు కళ్యాణ్. తమ నమ్మకం నిలబెడుతూ ప్రేక్షకులు సినిమాకు అద్భుతమైన విజయం అందించారు అని ఆయన చెప్పాడు. మొదటి వారం బంగార్రాజు 34 కోట్ల షేర్ వసూలు చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
మెగా కాంపౌండ్‌లోకి ఎంటర్ అవుతున్న కృతి శెట్టి.. వైష్ణవ్ తేజ్ తర్వాత ఆయనతో..
Naga chaitanya | కళ్లతోనే మాయ చేస్తున్న నాగచైతన్య
హాట్రిక్ కొట్టిన బేబమ్మ.. గోల్డెన్ లెగ్ అయిపోయిన కృతి శెట్టి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

