Suriya | తమిళ హీరో సూర్యకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఎప్పుడో 16 ఏళ్ల కింద వచ్చిన గజినీ సినిమాతోనే ఇక్కడ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు సూర్య. అల్లు అరవింద్ విడుదల చేసిన ఆ సినిమా అప్పట్లోనే 10 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత వీడొక్కడే, యముడు, సింగం, 24 లాంటి విజయాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సృష్టించుకున్నాడు సూర్య. ఈయనకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ చూసి చాలా మంది దర్శకులు స్ట్రైట్ తెలుగు సినిమా చేయడానికి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నారు.
ఆ మధ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా వస్తుంది అని ప్రచారం కూడా జోరుగా జరిగింది. అయితే అది కేవలం గాసిప్స్ గానే మిగిలి పోయాయి. ఇక తర్వాత సూర్య తన సినిమాలతో బిజీ అయిపోయాడు. మరోవైపు బోయపాటి శ్రీను కూడా ఇతర సినిమాలు చేస్తున్నాడు. దాంతో ఇప్పట్లో సూర్య స్ట్రైట్ తెలుగు సినిమా కష్టమే అనుకున్నారంతా. అయితే తాజాగా దీనిపై మళ్లీ వార్తలు మొదలయ్యాయి. శంఖం శౌర్యం లాంటి సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శివ.. తమిళంలో అజిత్, రజినీకాంత్ లాంటి హీరోలతో పని చేసి స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. దీనిమీద అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
ఈ సినిమాతోనే నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించాలని చూస్తున్నాడు సూర్య. ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు శివ. డబ్బింగ్ సినిమాలో కాకుండా ద్విభాష చిత్రంగా దీన్ని తీసుకొస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించబోతుందని తెలుస్తోంది. శౌర్యం, శంఖం తర్వాత తెలుగు ప్రేక్షకులకు కాస్త గ్యాప్ ఇచ్చాడు శివ. రవితేజ హీరోగా వచ్చిన దరువు సినిమాతో చివరిసారిగా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఈయన. ఆ తర్వాత తమిళంలో విక్రమార్కుడు రీమేక్ సిరుతైతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ వెంటనే అజిత్ హీరోగా వచ్చిన వీరం, వేదాళం, విశ్వాసం లాంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. గతేడాది రజనీకాంత్ హీరోగా వచ్చిన పెద్దన్న ఫ్లాప్ కావడంతో.. సూర్య సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు శివ. మొత్తానికి ఈ కాంబినేషన్ ఏం మాయ చేస్తుందో చూడాలి.
“Suriya41 | ‘అచలుడు’గా సూర్య.. ఆసక్తి రేకెత్తిస్తున్న టైటిల్ లుక్”
“Suriya | రెమ్యునరేషన్ తీసుకోని సూర్య..కారణం చెప్పిన స్టార్ డైరెక్టర్..!”
“Suriya fans | సూర్య ఫ్యాన్స్‌కు ఇక విజువల్ ట్రీటే..ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా..?”