Suriya41 | ‘అచలుడు’గా సూర్య.. ఆసక్తి రేకెత్తిస్తున్న టైటిల్ లుక్
Suriya-bala Movie Title | విలక్షణమైన నటనతో విమర్శకులను సైతం ఔరా అనిపించే నటుడు సూర్య. రియలిస్టిక్‌గా, నాచ్యురాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలను తెరకెక్కించే దర్శకులలో బాలా ఒకడు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతుందంటే సినీప్రేక్షకులకు పండగే. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన నంద, శివపుత్రుడు కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయిన విమర్శకుల నుండి గొప్ప ప్రశంసలు దక్కాయి. ఈ రెండు చిత్రాలు వీళ్ళ కెరీర్లో ఎప్పటికి గుర్తిండిపోయే సినిమాలుగా నిలిచాయి. మళ్ళీ 18 ఏళ్ళ తర్వాత వీరి కలయికలో సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకులలో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘అచలుడు’ అనే టైటిల్‌ను ఖారారు చేస్తూ సూర్య లుక్‌ను రిలీజ్ చేశారు. సూర్య రగ్గుడ్లుక్లో మీసానికి గాటు పెట్టుకుని ఇంటెన్సీవ్ కళ్ళతో చూస్తున్నాడు. కేవలం పోస్టర్‌తోనే సినిమాపై విపరీమైన క్యూరియాసిటీ పెరిగింది. ఈ చిత్రంలో సూర్య చెవిటివాడిగానూ, మూగవాడిగానూ నటించనున్నట్లు టాక్. కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి జీ.వి ప్రకాష్‌కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సూర్య తన సొంత నిర్మాణ సంస్థ అయిన 2డీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు.
உங்களுடன் மீண்டும் இணைந்ததில் பெருமகிழ்ச்சி..! பிறந்தநாள் வாழ்த்துக்கள் அண்ணா…! #DirBala #வணங்கான் #Vanangaan #Achaludu pic.twitter.com/OAqpCRCWgx
— Suriya Sivakumar (@Suriya_offl) July 11, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

