స్టార్ హీరో సూర్య (Suriya) అభిమానులకు ఎప్పటినుంచో ఉన్న కల నెరవేరబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇంతకీ ఆ కల ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. సూర్య సోదరుడు కార్తీ(Karthi) తో కలిసి సినిమా చేయడం. ఇపుడిదే విషయంపై క్రేజీ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఇద్దరు హిట్ బ్లాక్ బాస్టర్ సీక్వెల్లో నటించబోతున్నారన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.
ఓవర్‌నైట్ జరిగే స్టోరీతో తెరకెక్కిన చిత్రం ఖైదీ. లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కార్తీ టైటిల్ రోల్ పోషించాడు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. కార్తీ యాక్టింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. కార్తీ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇపుడీ ప్రాజెక్టుకు సీక్వెల్ ఖైదీ 2 (Kaithi 2) రాబోతుండగా..ఈ మూవీలో సూర్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడని టాక్ నడుస్తోంది.
ఇదే నిజమైతే సూర్య ఫ్యాన్స్ కు పండగ అన్నమాట. అయితే మరి ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వస్తే క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. సీక్వెల్‌ను కూడా లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. మరి రెండో పార్టులో కార్తీని ఎలా చూపించబోతున్నాడనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.