తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (Telugu Cinema)లో టాలెంటెడ్ హీరోయిన్లకు కొదవేమి లేదు.. ఏ ప్రాంతం నుంచి టాలీవుడ్‌కు వచ్చినా తాము తెలుగు హీరోయిన్లమని గర్వంగా చెప్పుకునేందుకు చాలా మంది నటీమణులు రెడీగా ఉంటారు. అలాంటి వారి జాబితాలో ముందు వరుసలో ఉంటుంది ముంబై భామ తమన్నా భాటియా (Tamannah Bhatia). శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తొలిసారి పలుకరించిన మిల్కీ బ్యూటీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది.
సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్లతో సన్నిహిత సన్నివేశాలు ( Intimate Scenes) చేస్తున్నపుడు హీరోలు గొప్ప అనుభూతి పొందుతారని చాలా మంది ప్రేక్షకులు అనుకుంటుంటారు. అయితే సన్నిహిత సన్నివేశాలు షూట్ చేస్తున్నపుడు చాలా హాయిగా ఫీలయ్యే వాళ్లు, ఇబ్బందిగా భావించే నటీనటులు తనకు తెలుసునని చెబుతోంది తమన్నా. సన్నిహిత సీన్ల విషయం గురించి స్పందిస్తూ.. బేసిక్‌గా ఇది కేవలం యాక్టర్లు కూడా మనుషులే అని అర్థం చేసుకోవడం మాత్రమే.. కానీ స్త్రీ, పురుషుల గురించి కాదు.
ఆ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో అమ్మాయి ఎలా ఫీలవుతుందోనని కొన్ని సార్లు అబ్బాయిలు ఎక్కువగా ఆందోళన చెందుతుంటారంది. అయితే తమన్నా అభిప్రాయాన్ని అందరికీ ఆపాదించలేమని, సన్నిహిత సన్నివేశాలను షూట్ చేసే సమయంలో భిన్నంగా ప్రవర్తించే పురుషులు కూడా ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
తమన్నా ప్రస్తుతం చిరంజీవి నటిస్తోన్న భోళాశంకర్ లో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. దీంతోపాటు హిందీలో భోలే చూడియాన్, మలయాళంలో బాంద్రా సినిమాల్లో నటిస్తోంది.
Read Also : Dil Raju | బాక్సాఫీస్ బరిలో విజయ్-అజిత్.. పోటీపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ
Read Also : Unstoppable 2 | రెండు పార్టులుగా బాలకృష్ణ-ప్రభాస్ అన్‌స్టాపబుల్ షో
Read Also : Waltair Veerayya | వాల్తేరు వీరయ్య నుంచి మెగా మాస్ సాంగ్‌కు టైం ఫిక్స్
Read Also : Neevuntey Chaalu lyrical | మైఖేల్ నుంచి నీవుంటే చాలు లిరికల్ వీడియో సాంగ్