Dil Raju | బాక్సాఫీస్ బరిలో విజయ్-అజిత్.. పోటీపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ
విజయ్ నటిస్తున్న తాజా చిత్రం (Varisu) వారిసుమరో స్టార్ హీరో అజిత్ నటించిన తునివు (Thunivu). తెగింపు టైటిల్‌తో తెలుగులో విడుదలవుతుంది. ఈ రెండు భారీ చిత్రాలు తమిళనాడులో పొంగల్ కానుకగా బరిలోకి దిగుతున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్, విజయ్ త్వరలోనే బాక్సాఫీస్ పోరుకు రెడీ అవుతున్నారని తెలిసిందే. విజయ్ నటిస్తున్న తాజా చిత్రం (Varisu) వారిసు. తెలుగులో వారసుడు టైటిల్‌తో తెరకెక్కుతుంది. మరో స్టార్ హీరో అజిత్ నటించిన తునివు (Thunivu). తెగింపు టైటిల్‌తో తెలుగులో విడుదలవుతుంది. ఈ రెండు భారీ చిత్రాలు తమిళనాడులో పొంగల్ కానుకగా బరిలోకి దిగుతున్నాయి.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి కానుకగా విడుదలవుతున్నాయి. ఈ రెండు చిత్రాలు తమిళనాడులో జనవరి 12న బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేయబడ్డ థియేటర్లలో విడుదల కానున్నాయి. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ గురించి నిర్మాత దిల్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. తమిళనాడులో తాను నిర్మించిన వారిసు చిత్రానికి అదనపు థియేటర్లు ఇవ్వాలని రెడ్ జియాంట్ కంపెనీని విజ్ఞప్తి చేస్తున్నట్టు ఇంటర్వ్యూలో చెప్పారు.
ఓ స్టార్ హీరో స్టామినా ఏంటో అతడి గత ఐదారు సినిమాల థ్రియాట్రికల్ రెవెన్యూ చెబుతుందని అన్నారు. అయితే ఒక యాక్టర్ సినిమాలు తీర్పులతో సంబంధం లేకుండా మంచి వసూళ్లు సాధిస్తేనే అతడు స్టార్ హీరో అవుతాడని చెప్పారు.విజయ్ గత 5 సినిమాలు తమిళనాడులో హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా రూ.60 కోట్ల షేర్ వసూళ్లు చేశాయన్నారు.
అజిత్ కూడా తమిళంలో పెద్ద స్టార్ హీరో అని, తాను గతంలో చేసిన కామెంట్స్ నుద్దేశించి గత సినిమాల రెవెన్యూ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. ఒకరినొకరిని పోలుస్తూ ఏ హీరోను తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదని, విజయ్ గత ట్రాక్ రికార్డ్ ఆధారంగా వారిసు సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇవ్వాలని కోరుతున్నానని చెప్పుకొచ్చారు దిల్ రాజు.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న వారిసు చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, శరత్ కుమార్, జయసుధ, ఖుష్బూ సుందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు హెచ్ వినోథ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న తునివు..నో గట్స్ నో గ్లోరీ ట్యాగ్‌లైన్‌తో వస్తుంది. మలయాళ భామ మంజు వారియర్ ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. తునివు చిత్రంలో సంజయ్ దత్, సముద్రఖని, మహానంది శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Also : Unstoppable 2 | రెండు పార్టులుగా బాలకృష్ణ-ప్రభాస్ అన్‌స్టాపబుల్ షో
Read Also : Waltair Veerayya | వాల్తేరు వీరయ్య నుంచి మెగా మాస్ సాంగ్‌కు టైం ఫిక్స్
Read Also : Neevuntey Chaalu lyrical | మైఖేల్ నుంచి నీవుంటే చాలు లిరికల్ వీడియో సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan Movie | ‘కామ్రేడ్ కళ్యాణ్’ రివ్యూ.. శ్రీవిష్ణు కొత్త సినిమా ఎలా ఉందంటే.!
MBBS Seat | పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన మాగనూర్ ముద్దుబిడ్డ
Ajmer Jailer | మహిళా ఖైదీలను జైలు నుంచి తీసుకెళ్లి ఇంటి శుభ్రం.. జైలర్ అరెస్ట్
పూలతో బతుకమ్మ వైభవం- అక్షరాలతో భావితరాల వికాసం
ప్లాస్టిక్ కవర్ల విక్రయాలపై అధికారుల రైడ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

