శ్రీ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసి..ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటించింది మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah). తక్కువ కాలంలోనే వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా నిలిచిన చాలా ప్రొఫెషనల్‌గా ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ భామ ఎప్పుడూ ప్రొఫెషనల్ కమిట్ మెంట్స్ చాలా బిజీబిజీగా ఉంటుంది. అయితే ఎప్పుడైనా తీరిక దొరికితే తనకిష్టమైన పనులకు టైం కేటాయిస్తుంటుంది.
ఇపుడు తమన్నాకు టైం దొరికింది..తన ఫేవరేట్ టూరిజం స్పాట్ మాల్దీవుల (Maldives)కు వెళ్లింది. నేవీ బ్లూ షార్ట్స్, ఫ్లోరల్ పింక్ జాకెట్ (floral pink jacket)లో ఉన్న ఐసీక్రీమ్ సైకిల్ ట్రాలీ (ice cream truck)ని తీసుకుంది. ఇంకేముంది బీచ్ వెంబడి తిరుగుతూ సరదాగా ఐస్‌క్రీమ్‌లు అమ్మింది. ఓ వైపు పొట్టి డ్రెస్‌లో అందాల ఆరబోస్తూ.. మరోవైపు ఐసీక్రీమ్ వ్యాపారిలా మారిన తమన్నా స్టిల్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఐస్‌క్రీమ్‌లతో ఉన్న ట్రంక్ మొత్తం ఎవరి వద్ద ఉందో ఊహించండి..అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
తమన్నా చేతిలో ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయి. వెంకటేశ్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ ఎఫ్ 3, సత్యదేవ్‌తో గుర్తుందా సీతాకాలం, మెగాస్టార్ చిరంజీవి-మెహర్ రమేశ్ కాంబోలో వస్తున్న భోళాశంకర్ సినిమాల్లో నటిస్తోంది.
Guess who has all the ice cream in the trunk 🍦@MovenpickHotels @oneaboveglobal
#movenpickmaldives #movenpickkuredhivarumaldives #wemakemoments pic.twitter.com/zyuOc0YXqu— Tamannaah Bhatia (@tamannaahspeaks) March 19, 2022
మాల్దీవుల్లో తమన్నా అందాల బోత వీడియో..
#tamanna #tamannahbhatia pic.twitter.com/yiRsUFTme3
— Actress gallery (@actress8393) March 19, 2022