Tamannaah Bhatia | ప్రముఖ నటి తమన్నా భాటియా గత కొద్దినెలలుగా నటుడు విజయ్ వర్మతో పీకలోతు ప్రేమలో మునిగితేలుతున్నది. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు టాక్. వీరిద్దరి పెళ్లి వేదికగా హైదరాబాద్ కానున్నట్లు తెలుస్తున్నది. విజయ్ స్వస్థలం హైదరాబాద్ కావడంతో ఇక్కడే పెళ్లి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రముఖ రిసార్ట్‌లో పెళ్లి వేడుక జరుగనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే, పెళ్లి వార్తలపై అటు తమన్నా.. ఇటు విజయ్ వర్మ స్పందించలేదు. తమన్నా, విజయ్ వర్మ గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారు. లస్ట్ స్టోరీ-2 మూవీ సమయంలో ప్రేమ విషయాన్ని బయట పెట్టారు. అప్పటి నుంచి పెళ్లిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజాగా నూతన సంవత్సరం 2025లో పెళ్లి చేసుకోనున్నారనే వార్త ట్రెండింగ్‌గా మారింది. పెళ్లి నేపథ్యంలో కాపురం పెట్టేందుకు ముంబయి బాంద్రాలో అపార్ట్మెంట్ కొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. విలాసవంతంగా ఉండే అపార్ట్మెంట్ కోసం వెతుకుతున్నారని.. పెళ్లి తర్వాత ఈ జంట అక్కడే కాపురం పెట్టాలని భావిస్తున్నట్లు బాలీవుడ్ కోడై కూస్తున్నది. విజయ్ వర్మ పుణేలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో నటనలో శిక్షన తీసుకున్నాడు. ‘గల్లిబాయ్’ సినీరంగ ప్రవేశం చేశారు. ‘మీర్జాపూర్’, ఐసీ814’ తదితర సినిమాల్లో కనిపించాడు. ఇక తమన్నా తెలుగు, తమిళం సినిమాలు చేసి అగ్రహీరోయిన్‌గా కొనసాగుతున్నది. ఇటీవల దక్షిణాదిలో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్లో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం తెలుగులో ఓదెల 2 మూవీలో నటిస్తున్నది.