Tamannaah Bhatia | మిల్కీబ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్లో అగ్రహీరోయిన్‌గా కొనసాగుతున్నది. 2005లో తెలుగులో శ్రీ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. తక్కువ సమయంలో టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ అలరిస్తున్నది. కొంతకాలంగా విజయ్ వర్మతో మిల్కీబ్యూటీ డేటింగ్ చేస్తున్నది. పెళ్లి చేసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత త్వరలోనే పెళ్లి పీటలక్కెబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తమన్నా ఎక్కడికి వెళ్లినా పెళ్లిపై ప్రశ్నలు ఎదురుకావడంతో దాట వేస్తూ వచ్చింది.
తాజాగా అందరినీ షాక్‌కు గురి చేస్తూ పెళ్లిపై కీలక కామెంట్స్ చేసింది. ప్రస్తుతం తమన్నా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మిల్కి బ్యూటీ హైదరాబాద్‌లో ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా పెళ్లిపై పలువురు జర్నలిస్ట్‌లు ప్రశ్నించారు. తాను పెళ్లి చేసుకోవడం లేదు.. కంగారు పడొద్దంటూ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇదిలా ఉండగా.. తమన్నా బాలీవుడ్‌పై దృష్టి సారించింది. హీరోయిన్‌తో పాటు అతిథిపాత్రల్లోనూ నటిస్తున్నది. చివరిసారిగా తమిళ రిమేక్ మూవీ బాక్లో కనిపించింది. ప్రస్తుతం తెలుగులో ఓదెల-2 మూవీలో నటిస్తున్నది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కొనసాగుతున్నది.
Pooja Hegde | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. దేవ షూట్‌పై పూజాహెగ్డే టీం కొత్త వార్త ఇదే..!
Darshan | రేణుకాస్వామి హత్య కేసులో.. హీరో దర్శన్, పవిత్రగౌడపై పోలీసుల చార్జిషీట్..!