Golla Ramavva | దివంగత భారత మాజీ ప్రధాని, భారత రత్న పీవీ నరసింహారావు రాసిన కథల్లో ఒకటి గొల్ల రామవ్వ (Golla Ramavva). తెలంగాణ సాయుధ పోరాట గాథ నేపథ్యంలో సాగే ఈ స్టోరీ సిల్వర్ స్రీన్పైకి రాబోతుంది. పాపులర్ రైటర్, ప్రొడ్యూసర్, దివంగత ముళ్లపూడి వెంకటరమణ కుమారుడు వర ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.
భయం పోయినప్పుడు ధైర్యం మొదలవుతుంది.. ప్రతిఘటన, ఆశ చుట్టూ తిరిగే శక్తివంతమైన కథ.. అంటూ తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం ఈటీవీ విన్లో ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, మలయాళం, ఒడియా భాషల్లో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న తళ్లూరి రామేశ్వరి ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
రజాకార్ల దాష్టికానికి తెలంగాణ ప్రాంతం వణికిపోతున్న కాలంలో ఓ పల్లెలో జరిగే కథ ఇది. కథాసుధలో భాగంగా 30 నిమిషాల రన్‌టైంతో సాగే ఈ ప్రాజెక్ట్ సాయుధ పోరాట యోధుడిని రక్షించడంలో గొల్ల రామవ్వ ఎలాంటి త్యాగానికి సిద్దపడిందనే నేపథ్యంలో సాగనుంది. ఈ ప్రాజెక్టుకు సాయి మధుకర్ సంగీతం అందిస్తుండగా.. అజహర్ షేక్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.
Golla Ramavva
When fear ends, courage begins. 🇮🇳
A powerful tale of resistance and hope.From #KathaSudha • Premieres Jan 25 • @etvwin ✨
🎭 Cast – Talluri Rameshwari, Anvith, Mani Mathena, Allu Geetha
Directed by – Vara Mullapudi
Producers – Ram Vishwas Hanurkar,… pic.twitter.com/90MiUDP21U— ETV Win (@etvwin) January 21, 2026
Chiru 158 | చిరంజీవి–బాబీ కొల్లి కాంబోపై అంచనాలు .. కృతి శెట్టి పాత్రపై తొలగిన అనుమానాలు