బుధవారం 08 జూలై 2020
Cinema - May 28, 2020 , 12:40:28

సినీ కార్మికుల‌కు 'త‌ల‌సాని ట్ర‌స్ట్' నిత్యావ‌స‌రాలు

సినీ కార్మికుల‌కు 'త‌ల‌సాని ట్ర‌స్ట్' నిత్యావ‌స‌రాలు

లాక్‌డౌన్ వ‌ల‌న ఇబ్బందులు ప‌డుతున్న సినీ కార్మికులకు తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అండ‌గా నిలిచారు. కృష్ణాన‌గ‌ర్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో 14 వేల మంది సినీ కార్మికులకి(24 సినిమా విభాగాలు) త‌ల‌సాని ట్ర‌స్ట్ నుండి నిత్యావ‌స‌ర వ‌స్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  దిల్ రాజు, నాగార్జున‌, రాధాకృష్ణ‌, త్రివిక్ర‌మ్, కొర‌టాల శివ‌, రాజ‌మౌళి, ఎన్ శంక‌ర్  త‌దిత‌రులు పాల్గొన్నారు.

అంత‌క‌ముందు త‌ల‌సాని మారేడ్ పల్లి లోని మల్టీపర్పస్ ఫంక్షన్ హల్ నుండి నిత్యావసర వస్తువులు ఉన్న వాహనాలను ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు మరియు సినీపరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. టాలీవుడ్‌లో ఏర్పాటైన క‌రోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా కూడా సినీ కార్మికుల‌కి నిత్యావ‌స‌రాలు అందిన విష‌యం తెలిసిందే. logo