Auron Mein Kahan Dum Tha | బాలీవుడ్ అగ్ర నటులు అజయ్ దేవగణ్ (Ajay Devgn), టబు (Tabu) ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమకథా చిత్రం ‘ఔర్ మే కహా దమ్ థా’(Auron Mein Kahan Dum Tha). ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించగా.. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రీసెంట్గా ఈ సినిమా ప్రమోషన్లో పాల్గోన్న టబు పారితోషికం వ్యత్యాసాలపై గట్టిగా స్పందించింది.
ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక రిపోర్టర్ ఈ సినిమాకు మీ రెమ్యూనరేషన్ ఎంత అని అడుగుతాడు. దీనిపై స్పందించిన టబు ప్రతిసారి ఈ ప్రశ్నను హీరోయినులను మాత్రామే ఎందుకు అడుగుతారు. నిర్మాతలను అడగవచ్చు కదా! అలాగే మీకు మాత్రమే ఎందుకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అంటూ హీరోలను కూడా అడగవచ్చు కదా? ఇలా మీరు అడిగితే ఇలాంటి విషయంలో ఎన్నో మార్పులు వస్తాయి అని టబు తెలిపారు.
రీసెంట్గా బాలీవుడ్లో క్రూ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ భామ. కరీనా కపూర్, టబు, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం రూ.100 కోట్ల వసుళ్లను రాబట్టింది. మరోవైపు ఇప్పటికే అజయ్‌తో కలిసి టబు హిందీ ‘దృశ్యం’తో పాటు దే దే ప్యార్ దే (De De Pyaar De) సినిమాలో నటించారు. ఇక ‘ఔర్ మే కహా దమ్ థా’ చిత్రంలో వీరి కాంబో రిపీట్ అవుతుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చిన్న వయసు నుంచే ఇష్టాన్ని పెంచుకున్న కృష్ణ(అజయ్), వసుధ (టబు)లు ఒకరంటే ఒకరికి ప్రాణం ఉండి ఎందుకు విడిపోయారు? మళ్లీ తిరిగి కలిశారా? లేదా? విడిపోయిన తర్వాత వారి జీవితాల్లో వచ్చిన మార్పులు ఏమిటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది.
Also Read..
Somalia Attack: సొమాలియాలో ఆత్మాహుతి దాడి.. 32 మంది మృతి
Sharad Pawar | మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ భేటీ.. Video