న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి తాప్సీ పన్నూ తన సోదరి షాగున్‌తో కలిసి రష్యాలో టూర్ చేస్తోంది. వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆ బామ అన్ని నగరాలను చుట్టేస్తోంది. ఇక సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఓ డిన్నర్‌కు అటెండ్ అయ్యింది ఆ క్యూటీ. స్పెషల్ సారీలో ఆమె ఆ పార్టీకి వెళ్లింది. బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకున్న తాప్సీ.. సమ్మర్ చీరలో చిల్లింగ్‌గా కనిపించింది. చేతికి గాజులు.. సన్‌గ్లాసెస్‌తో తెగ హడావుడిగా రోడ్డుపై పరుగు తీస్తున్న ఓ ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్టు చేసిందామె. పిచ్చి కూల్‌గా ఉన్న ఆ స్టార్.. పీటర్స్బర్గ్ రోడ్డుపై ఉన్న లేన్లను మెచ్చుకున్నది. సెయింట్ పీటర్స్బర్గ్ కన్నా ముందు తాప్సీ మాస్కోలోనూ చక్కర్లు కొట్టింది. రష్యా రాజధానిలో దిగిన ఫోటోలను కూడా ఇన్‌స్టాలో పెట్టిందామె. తాప్సీ నటించిన హసీనా దిల్రుబా చిత్రం త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్నది. లూప్ లపేటా, రశ్మీ రాకెట్, శాభాష్ మిట్టు లాంటి సినిమాల్లోనూ ఆమె నటిస్తోంది.