ఝుమ్మంది నాదం సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది ఢిల్లీ భామ తాప్సీ పన్ను (Taapsee Pannu). ఆ తర్వాత తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఓ ఐపు భారీ సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు ఓటీటీ ప్రాజెక్టులు కూడా చేస్తోంది. తాప్సీ వెబ్ ఒరిజినల్ ఫిలిం లూప్ లపేటాకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ ఓటీటీ అవార్డు (Filmfare OTT Awards)ను అందుకుంది.
సాండ్ కీ ఆంఖ్ (2020), థప్పడ్ (2021) చిత్రాల తర్వాత తాప్సీ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం ఇది మూడోసారి కావడం విశేషం. లూప్ లపేటా (Taapsee Pannu) సినిమాను నేనెందుకు చేయాలనుకుంటున్నానో.. రన్ లోలా రన్ లాంటి క్లాసిక్‌ని నేను ఎందుకు టచ్ చేయాలనుకుంటున్నానో ఎవరికీ అర్థం కాలేదు.. అని అవార్డు గెలుచుకున్న తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది తాప్సీ.
ప్రస్తుతం తాప్సీ తమిళంలో జనగణమన, ఏలియన్ చిత్రాల్లో నటిస్తోంది తాప్సీ. హిందీలో వో లడ్కీ హై కహాన్తోపాటు రాజ్‌కుమార్ హిరానీ డైరెక్షన్లో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తోన్న డుంకీ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
The folks at @EllipsisEntt were beaming last night when @taapsee picked up Best Actress for "Looop Lapeta."
Brave choices lead to awesome wins. Hope @filmfare nominates the awesome crew and film at the forthcoming awards, which is where they actually belong.#FilmfareOTTAwards2022 pic.twitter.com/yBGxlybYpz— TANUJ GARG (@tanuj_garg) December 22, 2022
Read Also : Vinaro Bhagyamu Vishnu Katha | కూల్‌గా కిరణ్ అబ్బవరం వాసవ సుహాస సాంగ్ ప్రోమో
Read Also : Naatu Naatu Song | నాటు నాటు క్రేజ్‌కు ఆస్కార్ రావాల్సిందే.. వీడియో సాంగ్‌పై లుక్కేయండి
Read Also : Vijay Sethupathi | విజయ్ సేతుపతి అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. గెట్ రెడీ