సిల్వర్ స్క్రీన్‌పై తెలంగాణ బ్యాక్ డ్రాప్లో సాగే పాటలకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల వాళ్లు ఎంజాయ్ చేసేలా మాస్ బీట్ సాంగ్ చేయాలంటే మన తర్వాతే ఎవరైనా అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. తెలంగాణ మాస్ సాంగ్స్, డ్యాన్స్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతగా ఇష్టపడతారో చెప్పేందుకు ఈ ఒక్క పాట చాలు. ఇంతకీ ఆ పాటేంటో గుర్తొచ్చే ఉంటుంది.
గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా రేంజ్ ఏంటో మరోసారి చూపించింది ఆర్ఆర్ఆర్ (RRR). ఈ సినిమాలోని నాటు నాటు (Naatu Naatu song) పాట వరల్డ్‌వైడ్‌గా మార్మోగిపోయింది. సాంగ్ ప్రోమో విడుదలైనప్పటి నుంచి ఇప్పటికీ.. ఎప్పటికీ కూడా ఈ పాట టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చంద్రబోస్ రాసిన నాటు నాటు పాటను ఎంఎం కీరవాణి కంపోజ్ చేయగా.. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు.
నాటు నాటు వీడియో సాంగ్..
ఇరగదీసిన ఉక్రెయిన్ బ్యూటీ..
పక్కా ఊరమాస్ స్టెప్పులతో స్టార్ హీరోలు రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే డ్యాన్స్ చేసి గ్లోబల్ బాక్సాఫీస్ దుమ్ము దులిపేశారు. ఈ పాటపై డబ్ స్మాష్ వీడియోలు ఎన్ని వచ్చాయో చెప్పడం కష్టమే. ఇక ఈ సాంగ్‌లో ఉక్రెయిన్ భామ ఒలీవియా మొర్రీస్ కూడా నాటు నాటుగా ఇరగదీసే స్టెప్పులేస్తూ ప్రేక్షకులతో ఈలలు వేయించిందంటే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
95వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్‌లో షార్ట్‌లిస్ట్ జాబితాలో ఆర్ఆర్ఆర్ చోటుదక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్లోని ‘నాటు నాటు’ పాటకు స్థానం దక్కింది.ఆస్కార్‌కు పోటీపడుతున్న మొత్తం 81 ట్యూన్స్ నుంచి 15 పాటలను షార్ట్ లిస్ట్ చేశారు.
ఈ పాటల్లో నాటు నాటుతోపాటు అవతార్-2లోని నథింగ్ ఈ లాస్ట్, బ్లాక్ పాంథర్‌లోని లిఫ్ట్ మీ అప్, టాప్ గన్ సినిమాలోని హోల్డ్ మై హాండ్ ఉన్నాయి. ఈ 15 సినిమాల్లో ఐదు మూవీస్‌ను జనవరిలో ఆస్కార్‌కు నామినేట్ చేస్తారు. కాగా వీటిలో నాటు నాటు సాంగ్ విజేతగా నిలవడం ఖాయమని ధీమాగా ఉన్నారు మూవీ లవర్స్. మార్చి 12న హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్లో ఆస్కార్ అవార్డులను ప్రకటించనున్నారు.