Swara Bhaskar | పెండ్లి పీటలెక్కిన స్వర భాస్కర్-ఫహాద్ అహ్మద్
నటి స్వర భాస్కర్ యువ రాజకీయ నాయకుడు ఫహాద్ అహ్మద్‌ను పెండ్లాడింది. ఈ విషయాన్ని వీడియో ద్వారా వెల్లడించింది. గత నెల 6 న పెండ్లి జరగ్గా.. ఇవాళ ఆ విషయాన్ని బయటపెట్టారు.
Swara Bhaskar | ఎప్పుడూ వార్తల్లో నిలిచే నటి స్వర భాస్కర్ పెండ్లి చేసుకున్నది. సమాజ్‌వాదీ పార్టీ పహాద్ అహ్మద్‌ను పెండ్లి చేసుకున్నట్లు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గత నెల 6 వ తేదీన ప్రత్యేక వివాహ చట్టం కింద కోర్టులో వీరు నమోదు చేసుకున్నారు. గురువారం దండలు మార్చుకున్న ఫొటోలను స్వర భాస్కర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. రెండు వారాల క్రితం ఫహాద్ అహ్మద్‌ను సోదరుడిగా పేర్కొన్న స్వర భాస్కర్.. ఇప్పుడు ఇలా ఆయనను పెండ్లి చేసుకున్న వీడియోను షేర్ చేయడంతో ఆమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
సోషల్ మీడియాలో ఆక్టీవ్‌గా ఉండే నటి స్వర భాస్కర్.. సమాజ్‌వాదీ పార్టీ యువజన విభాగం నాయకుడు ఫహాద్ అహ్మద్‌ను వివాహం చేసుకున్నది. ఫహాద్ మహారాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. ఫహాద్‌ను పెండ్లి చేసుకున్న స్వర భాస్కర్ 2 నిమిషాల 5 సెకండ్ల వీడియోను పోస్ట్ చేసి తమ ప్రేమ కథను కూడా వివరించారు. కొన్ని రోజుల క్రితం ఓ యువకుడి చేతుల్లో తల పెట్టి కూర్చున్న ఫొటోను స్వర భాస్కర్ షేర్ చేసింది. ఈ ఫొటోలో ఉన్న ఆ యువకుడికి మిస్టరీ బాయ్ అని పేరు పెట్టారు. ఆ ఫొటోలో ఉన్న మిస్టరీ బాయ్ ఎవరనేది అప్పుడు స్పష్టంగా తెలియరాలేదు. అయితే అయన మరెవరో కాదు ఫహద్ అహ్మద్ అని ఇప్పుడు తెలుస్తున్నది.
Sometimes you search far & wide for something that was right next to you all along. We were looking for love, but we found friendship first. And then we found each other!
Welcome to my heart @FahadZirarAhmad It’s chaotic but it’s yours! ♥️✨🧿 pic.twitter.com/GHh26GODbm— Swara Bhasker (@ReallySwara) February 16, 2023
రచయిత హిమాన్షు శర్మతో స్వర భాస్కర్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ రంఝానా సెట్స్‌లో కలుసుకుని స్నేహితులుగా మారారు. దాదాపు ఐదేండ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2019 లో విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. డీడీఎల్జే సినిమాలోని రాజ్ వంటి అబ్బాయిని ఇష్టపడతానని గత ఏడాది తన సినిమా ప్రమోషన్ సందర్భంగా స్వర భాస్కర్ చెప్పింది. షారూఖ్ నటించిన దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాని చిన్న వయసులో చూసినప్పటి నుంచి నా జీవితంలోకి వచ్చే రాజ్ కోసం వెతుకుతున్నానని వెల్లడించింది.
వివిధ రాజకీయ అంశాలపై నిర్మోహమాటంగా అభిప్రాయాలు చెప్పే స్వర భాస్కర్.. తన వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాకు చిరపరిచితురాలు. తాజాగా పఠాన్ సినిమాపై జరుగుతున్న వివాదంపై కూడా స్వర భాస్కర్ స్పందించాడు. భాజపా నేతలను టార్గెట్ చేస్తూ ఆమె చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి. తను వెడ్స్ మను, రాంఝానా, వీరే ది వెడ్డింగ్ వంటి చిత్రాలలో స్వర భాస్కర్ నటించారు. రాస్భరీ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. జహాన్ చార్ యార్‌లో నటించి మెప్పించిన స్వర భాస్కర్.. తదుపరి సినిమా మీమాంస విడుదలకు సిద్ధంగా ఉన్నది. మిసెస్ ఫలానీ సినిమా నిర్మాణ దశలో ఉన్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

