శుక్రవారం 03 జూలై 2020
Cinema - Jul 01, 2020 , 09:07:44

యాడ్ ఫిలింలో సుశాంత్.. బిహైండ్ ది సీన్ వీడియో

యాడ్ ఫిలింలో సుశాంత్.. బిహైండ్ ది సీన్ వీడియో

బుల్లితెర‌తో కెరీర్ స్టార్స్ చేసిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ .. అభిషేక్ క‌పూర్ రూపొందించిన కై పో చీ అనే చిత్రంతో బాలీవుడ్ ఆరంగేట్రం చేశాడు. ఈ సినిమా త‌ర్వాత ఎంఎస్ ధోని బ‌యోపిక్, ర‌బ్తా, కేదార్‌నాథ్‌, డ్రైవ్ తదిత‌ర చిత్రాలు చేశాడు. సుశాంత్ న‌టించిన దిల్ బెచారా చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. 

సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న‌కి సంబంధించిన పాత జ్ఞాప‌కాలు సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా యాడ్ ఫిలింకి సంబంధించిన షూటింగ్‌లో సుశాంత్ పాల్గొన‌గా, బిహైండ్ ది సీన్ వీడియో అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటున్నాయి. వ‌ర్క్‌పైనే త‌న శ్ర‌ద్ధ ఉంచాడే త‌ప్ప ఇత‌ర‌త్రా ఆలోచ‌న‌లు చేయ‌డం లేద‌ని అభిమానులు స్పందిస్తున్నారు.  logo