Suriya | ట్రెండ్ మారింది.. ఇతర భాషల హీరోల ఫోకస్ టాలీవుడ్‌పై పడింది. దీనిక్కారణం తెలుగులో కొత్తదనంతో కూడిన కథలు రావడమే. కంటెంట్‌ను నమ్మి సినిమా చేసే తమిళ స్టార్ హీరోలు ఇక తెలుగు దర్శకులతో సినిమాలు చేసేందుకు రెడీ అంటున్నారు. ఇప్పటికే జాతిరత్నాలు ఫేం అనుదీప్ కేవీతో కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ ప్రిన్స్ సినిమా చేయగా.. వెంకీ అట్లూరి తమిళ స్టార్ యాక్టర్ ధనుష్‌తో సార్ సినిమా చేశాడు. ఈ రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పటికే వెంకీ అట్లూరి సూర్యతో ఓ సినిమా చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఓ వైపు తెలుగు, మరోవైపు తమిళం ఇలా రెండు భాషల డైరెక్టర్లతో సినిమాలకు ప్లాన్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. సూర్య మరో టాలీవుడ్ డైరెక్టర్‌ను లైన్లో పెట్టాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి, సరిపోదా శనివారం సినిమాలతో డైరెక్టర్‌గా మంచి స్టాంప్ వేసుకున్నాడు వివేక్ ఆత్రేయ. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ సూర్యతో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట.
తాజా టాక్ ప్రకారం ప్రకారం వివేక్ ఆత్రేయ సూర్యను కలిసి ఓ కథ వినిపించగా.. స్క్రిప్ట్ ఇంప్రెసివ్‌గా ఉందని సూర్య చెప్పినట్టు ఫిలింనగర్ సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అయితే వివేక్ ఆత్రేయ సూర్య ఫైనల్ కాల్ కోసం ఎదురుచూస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో వస్తోన్న సూర్య 46 చిత్రాన్ని టాలీవుడ్ లీడింగ్ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కిస్తోంది. ఈ ప్రాజెక్టులో మమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది.
సూర్య ప్రస్తుతం తమిళంలో పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుప్పు (Karuppu) మూవీ చేస్తున్నాడు. గత కొన్నాళ్లుగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సూర్యకు మరి ఏ డైరెక్టర్ హిట్టు ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
Keerthy Suresh | చాలా బాధగా ఉంది.. AI డీప్‌ఫేక్ చిత్రాలపై కీర్తి సురేష్ ఎమోషనల్
Kapoor Family | కపూర్ ఫ్యామిలీ డిన్నర్లో కనిపించని ఆలియా భట్.. కారణం చెప్పిన అర్మాన్ జైన్!