Suriya | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య (Suriya). ఇప్పటికే శివ దర్శకత్వంలో చేస్తున్న కంగువ విడుదలకు రెడీ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మరోవైపు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వం వహిస్తున్న సూర్య 44 (Suriya 44)లో కూడా నటిస్తున్నాడు. దీంతోపాటు సుధా కొంగర డైరెక్ట్ చేయనున్న సూర్య 43 కూడా ట్రాక్‌పై ఉంది.
ఈ సినిమాలు లైన్లో ఉండగానే సూర్య 45 సినిమా అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. సూర్య ఈ చిత్రాన్ని ఆర్జే బాలాజీ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. 24 మూవీ తర్వాత మరోసారి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఏఆర్ రెహమాన్-సూర్య కాంబోలో రాబోతున్న నాలుగో సినిమా ఇది. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలో సందడి చేయనుంది సమాచారం.
ఇక షూటింగ్ దశలో ఉన్న సూర్య 44లో పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ అందిస్తున్నాడు. పీరియాడిక్ వార్ అండ్ లవ్ నేపథ్యంలో సూర్య హోంబ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని మేకర్స్ 2025 పొంగళ్ కానుకగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
#Suriya45 – #Suriya – #ARRahman combo for the Fourth Time..🔥 #Suriya – #RJBalaji – #ARRahman – Totally a Fresh and Unexpected combo this is..👌 pic.twitter.com/Poy85kVRTo
— Laxmi Kanth (@iammoviebuff007) September 24, 2024
Rathnavelu | దేవరలో జాన్వీకపూర్ కనిపించేది అప్పుడేనట.. రత్నవేలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Jr NTR | దేవర క్రేజ్.. తొలి భారతీయ హీరోగా తారక్ అరుదైన ఫీట్
Game Changer | ఎస్ థమన్ గేమ్ ఛేంజర్ థ్రిల్లింగ్ అనౌన్స్మెంట్ ఏంటో మరి..?