Suriya | కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య (Suriya) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఇటీవలే కంగువ సినిమా విడుదల కాగా.. బాక్సాఫీస్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక నెక్ట్స్ ప్రాజెక్టులు సూర్య 44, 45 సినిమాలపైనే తన ఫోకస్ అంతా పెట్టాడు సూర్య. కాగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వస్తోన్న సూర్య 44 ఇటీవలే కేరళ షెడ్యూల్ జరుపుకుంది. ఈ షెడ్యూల్లో ఆసక్తికరంగా మరో సినిమాకు సంబంధించిన చర్చ జరిగిందట.
పాపులర్ మలయాళ ఫిల్మ్ మేకర్ అమల్ నీరద్తో ఓ కథ గురించి చర్చించాడట సూర్య. అంతేకాదు అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే ఈ మూవీని కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేయాలని ఫిక్స్ అయినట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్. ఈ లెక్కన సూర్య కాంపౌండ్ నుంచి త్వరలోనే మరో సినిమా ప్రకటన కూడా ఉండబోతుందని అర్థమవుతోంది. సూర్య ఆర్జే బాలాజీ దర్శకత్వంలో నటిస్తోన్న సూర్య 45 షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే సూర్య చేతిలో గొడ్డలి పట్టుకున్న ప్రీ లుక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
ఈ చిత్రానికి సాయి అభ్యాంకర్ మ్యూజిక్ కంపోజర్. ఈ చిత్రంలో చెన్నై సుందరి త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సినిమా టైటిల్ కూడా ఫైనల్ చేశామని ఆర్జే బాలాజీ క్లారిటీ కూడా ఇచ్చేశాడు.
Akhanda 2 | అఖండ 2 వచ్చేది అప్పుడే.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న బాలకృష్ణ టీం రిలీజ్ డేట్ ప్రోమో
Manchu Manoj | నా తల్లి ఆస్పత్రిలో లేదు.. మాట్లాడుకోవడానికి సిద్ధం : మంచు మనోజ్