Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కాంపౌండ్ నుంచి వరుస సినిమాలు వస్తున్నాయని తెలిసిందే. వీటిలో ఒకటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న కంగువ (Kanguva). సూర్య 42వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి శివ (siva) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. బాబీ డియోల్ ఉధిరన్ పాత్రలో నటిస్తున్నాడు.
కాగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ స్ట్రాటజీతో ముందుకెళ్తోంది సూర్య టీం. తాజా సమాచారం ప్రకారం ఈ వారం కంగువ సెకండ్ సింగిల్ రాబోతుంది. ఆడియో లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 20న నిర్వహించనున్నారట. అంతేకాదు అక్టోబర్ చివరలో వరల్డ్ వైడ్ ప్రోమోను లాంచ్ చేయనుండగా.. నవంబర్ తొలి వారంలో ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారని ఇన్సైడ్ టాక్.
ఈ మూవీని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. కంగువను నైజాం ఏరియాలో పాపులర్ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేయనుంది.
కంగువ రెండు పార్టులుగా వస్తుండగా.. పార్టు 1 నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ముందుగా అక్టోబర్ 10న రావాల్సిన ఈ చిత్రాన్ని వెట్టైయాన్‌తో పోటీ ఉండొద్దని భావించిన మేకర్స్ కొత్త విడుదల తేదీని నిర్ణయించారని తెలిసిందే.
Read Also :
Khel Khel Mein | ఓటీటీలోకి అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Srinu Vaitla | ట్రెండ్‌కు తగినట్టుగా తీశా.. ఆ పాత్రను రీప్లేస్ చేయడం చాలా కష్టం: శ్రీనువైట్ల
Vijay Sethupathi | పాపులర్ లీడర్ బయోపిక్‌లో విజయ్ సేతుపతి.. వివరాలివే