Suriya 47 | కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఇప్పటికే ఆర్జే బాలాజీ డైరెక్షన్లో కరుప్పు సినిమా చేస్తుండగా.. మరోవైపు సూర్య 47 ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టాడు. మాలీవుడ్ మూవీ ఆవేశం ఫేం జీతూ మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో షురూ కానుందని తాజా వార్త ఒకటి తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో నజ్రియా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. నస్లేన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సూర్య ఈ చిత్రంలోపవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. మలయాళం, తమిళ బైలింగ్యువల్ మూవీగా రాబోతున్న ఈ చిత్రం కోసం జీతూమాధవన్ టీం లొకేషన్ వేటలో బిజీగా ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఉండబోతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్.
సూర్య కొత్తగా లాంచ్ చేసిన ప్రొడక్షన్ హౌస్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా.. పూర్తి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. మలయాళంలో యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా ఫహద్ ఫాసిల్ హీరోగా జీతూ మాధవన్ తెరకెక్కించిన ఆవేశం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. మరి జీతూ మాధవన్ సూర్యతో సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
Suriya – Jithu Madhavan film shoot to kick off Next Month💥#Suriya47
— Christopher Kanagaraj (@Chrissuccess) November 18, 2025
— #Suriya will next act in a bilingual Tamil and Malayalam film directed by #JithuMadhavan.
— The set work and location planning for the film are currently underway.
— This will be Suriya’s 47th film.
— Official Announcement Coming 🔜 #Suriya47 | #Karuppu | #Suriya46 pic.twitter.com/U73tlZcboP— Movie Tamil (@_MovieTamil) November 17, 2025
BISON OTT | ఓటీటీలోకి ధృవ్ విక్రమ్ ‘బైసన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!