Karuppu | కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya)నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి కరుప్పు (Karuppu). పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ (RJ Balaji) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగులో వీరభద్రుడు టైటిల్‌తో విడుదల కానుంది. ఈ చిత్రం మే 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కావాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం నుంచే థియేటర్లలో షోలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ రిలీజ్‌కు ముందు ఆర్థికపరమైన చిక్కులు తలెత్తడంతో మార్నింగ్ షోలు నిలిచిపోయినట్లు వార్లు వచ్చాయని తెలిసిందే.
తమిళనాడులో ప్రత్యేక షోలకు అనుమతులు వచ్చినప్పటికీ, అవి కూడా రద్దు కావడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చివరి నిమిషంలో షోలు రద్దు కావడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇదిలా ఉంటే మేకర్స్ , పైనాన్షియర్ల మధ్య నెలకొన్న సమస్యల కారణంగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కొంత అయోమయంలో పడ్డారని ఇన్సైడ్ టాక్. కాగా ఈ సమస్యను కొలిక్కి తీసుకువచ్చేందుకు సూర్య స్వయంగా రంగంలోకి దిగాడట. సంబంధిత పైనాన్షియర్లతో మాట్లాడి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి హామీనిచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం నుంచి సినిమా థియేటర్లలో స్క్రీనింగ్ అయ్యే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ సర్కిల్ టాక్.
ఈ మూవీలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. చాలా కాలం తర్వాత సూర్య, త్రిష కాంబోలో వస్తున్న సినిమా కావడంతో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి అభ్యాంకర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Rashmika | ‘మైసా’ కోసం రష్మిక కష్టాలు .. కాళ్లకు టేప్ వేసుకొని మరి..!
CM Vijay | త్వరలో మహిళలకు నెలకు రూ.1,000.. వెల్లడించిన తమిళనాడు సీఎం విజయ్