Suriya 46 | కోలీవుడ్ యాక్టర్ సూర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి వెంకీ అట్లూరి డైరెక్షన్లో చేస్తున్న సూర్య 46 (Suriya 46). ఈ చిత్రంలో ప్రేమలు ఫేం మమితా బైజు హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ నటి రవీనా టాండన్ కీలక పాత్ర పోషిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది.
ఫైనల్‌గా సూర్య 46 షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ఫ్రొడక్షన్ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయనని టాలీవుడ్ సర్కిల్ సమాచారం. ఇంకేంటి మరి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నట్టు కూడా తాజా అప్డేట్ హింట్ ఇచ్చేస్తుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
సూర్య 46 చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సూర్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.సూర్య మరోవైపు సుధాకొంగర డైరెక్షన్ల సూర్య 47లో నటిస్తున్నాడని తెలిసిందే.
Ustaad Bhagat Singh | ఉస్తాద్భగత్ సింగ్‌తో హరీష్ శంకర్ సెల్ఫీ.. ట్రెండింగ్‌లో స్టిల్స్