Suriya 46 | కోలీవుడ్ యాక్టర్ సూర్య చివరగా రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ప్రస్తుతం వెంకీ అట్లూరితో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సూర్య 46గా రాబోతున్న ఈ మూవీలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చాలా రోజులుగా సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం క్రేజీ వార్త బయటకు వచ్చింది.
ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అప్డేట్ ఒకటి అభిమానుల్లో జోష్ నింపుతోంది. ప్రస్తుతం సూర్య 46 చిత్రీకరణ కొనసాగుతుంది. ఇంతకీ సూర్య టీం ఎక్కడుందో తెలుసా..? యూరోపియన్ కంట్రీ బెలారస్లో ఉంది. ఈ షెడ్యూల్లో సూర్య అండ్ టీంపై వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌తోపాటు ఓ పాటను చిత్రీకరించనున్నారట.
సూర్య 46లో బాలీవుడ్ భామ రవీణా టాండన్. సీనియర్ నటి రాధికాశరత్ కుమార్, తమిళ నటి భవాని స్రే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సూర్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Actor Srikanth Bharat | మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు
The Paradise | దసరా డైరెక్టర్‌తో ‘కిల్’ రాఘవ.. నాని ది ప్యారడైజ్‌పై సూపర్ హైప్