Suriya 45 | వరుస సినిమాలను లైన్లో పెట్టి అభిమానులకు ఊపిరాడకుండా చేసేందుకు రెడీ అవుతున్న స్టార్ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు కోలీవుడ్ హీరో సూర్య (Suriya). ఇప్పటికే శివ దర్శకత్వంలో కంగువ చేస్తున్న సూర్య.. మరోవైపు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకత్వం లో సూర్య 44 (Suriya 44)లో కూడా నటిస్తున్నాడని తెలిసిందే.
మరోవైపు సుధా కొంగర డైరెక్ట్ చేయనున్న సూర్య 43కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ ప్రాజెక్టులన్నీ లైన్లో ఉండగానే అప్పుడే సూర్య 45 సినిమా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. ముందుగా వచ్చిన వార్తలే నిజమైనట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేయబోతున్నాడు. అంతేకాదు కంగువ రిలీజ్ తర్వాత అంటే నవంబర్లోనే ఈ మూవీ సెట్స్‌పైకి కూడా వెళ్లనుందని ఇన్సైడ్ టాక్. ఈ లెక్కన సూర్య బ్రేక్ తీసుకోకుండా నో రెస్ట్.. ఓన్లీ యాక్షన్ అని గట్టిగానే ఫిక్సయ్యాడని తెగ
తాజా వార్త చూసిన సినీ జనాలు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. 24 మూవీ తర్వాత సూర్య, ఏఆర్ రెహమాన్ కాంబోలో వస్తున్న మరో సినిమా కానుంది. ఏఆర్ రెహమాన్-సూర్య కాంబోలో వచ్చే నాలుగో సినిమా ఇది.
కంగువ నవంబర్ 14న విడుదల కానుంది. ఇక సూర్య హోంబ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న సూర్య 44 చిత్రాన్ని మేకర్స్ 2025 పొంగళ్ కానుకగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read Also :
Siddu Jonnalagadda | జాక్ షూట్ గురించి చెప్పిన సిద్ధు జొన్నలగడ్డ
They Call Him OG | ఓజీ అప్డేట్స్ త్వరలో.. పవన్ కల్యాణ్ అభిమానులను ఎస్ థమన్ గుడ్‌న్యూస్
Khel Khel Mein | ఓటీటీలోకి అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Srinu Vaitla | ట్రెండ్‌కు తగినట్టుగా తీశా.. ఆ పాత్రను రీప్లేస్ చేయడం చాలా కష్టం: శ్రీనువైట్ల