Suriya 44 | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కాంపౌండ్ నుంచి వస్తోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). సూర్య 42వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి శివ (Siva) దర్శకత్వం వహిస్తున్నాడు. కంగువ నవంబర్ 14న తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదలవుతుండగా.. ప్రస్తుతం సూర్య కంగువ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడని తెలిసిందే.
సూర్య టీం ఇప్పటికే కోచి, చెన్నైలో గ్రాండ్‌గా ప్రమోషన్స్ నిర్వహించింది. నేడు హైదరాబాద్‌లో తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. కాగా ఈ సినిమా విడుదల కాకముందే సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెండు సినిమాల అప్డేట్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సూర్య కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో నటిస్తోన్న సూర్య 44 (Suriya 44) చిత్రీకరణ పూర్తయింది. మరోవైపు సూర్య 45 షూటింగ్ కూడా మొదలయ్యే టైం వచ్చేసింది.
తాజా టాక్ ప్రకారం ఈ మూవీ చిత్రీకరణ నవంబర్ 18న కోయంబత్తూరులో షురూ కానుంది. సూర్య 45 మూవీ భక్తి నేపథ్యంలో సాగే ఫాంటసీ సినిమాగా రానున్నట్టు సమాచారం. మొత్తానికి కంగువ విడుదలైన తర్వాత నో రెస్ట్ అంటూ చెప్పకనే చెబుతూ ప్రేక్షకులు, అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు సూర్య.
Thug Life | కమల్‌హాసన్ ‘థగ్ లైఫ్’ టీజర్ రిలీజ్
Kanguva | ఇక హైదరాబాద్‌లో.. సూర్య కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైం, వెన్యూ ఫిక్స్..!
Sai Pallavi | సాయి పల్లవి యాక్టింగ్ చూసి ఏడ్చేశా.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్