Rajinikanth | షారుఖ్ ‘జవాన్’లో సూపర్‌స్టార్ రజినీకాంత్?
Rajinikanth In Shah Rukh Khan's Jawan Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోను వెండితెరపై చూడడానికి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. షారుఖ్ సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది. 2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. ఎప్పుడెప్పుడు షారుఖ్‌ను బిగ్స్క్రీన్పై చూస్తామా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Rajinikanth In Shah Rukh Khan’s Jawan Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోను వెండితెరపై చూడడానికి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. షారుఖ్ సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది. 2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. ఎప్పుడెప్పుడు షారుఖ్‌ను బిగ్స్క్రీన్పై చూస్తామా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈయన మూడు చిత్రాలను సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘జవాన్’ ఒకటి. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 2నవిడుదల కానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టంట వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలో గెస్ట్ రోల్లో ఓ తమిళ స్టార్ హీరో నటించనున్నాడని కోలీవుడ్ వర్గాల టాక్. అట్లీ ఈ సినిమాలో అతిథి పాత్ర కోసం సూపర్ స్టార్ రజినీకాంత్‌ను సంప్రదించాడట. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు సూపర్‌స్టార్ కూడా సినిమాలో కనిపిస్తే తమిళంలో కూడా ఈ చిత్రం భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందని అట్లీ భావిస్తున్నాడట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. గతంలో కూడా ఈ చిత్రంలో విజయ్ కీ రోల్లో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అది రూమర్‌గానే మిగిలిపోయింది. ఇక ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో షారుఖ్ తండ్రి, కొడుకుగా డ్యూయల్ రోల్లో నటించనున్నాడు. నయనతార ఇన్వెస్టిగేటీవ్ ఆఫీసర్‌గా నటించనుంది. ప్రస్తుతం షారుఖ్ నటించిన ‘పఠాన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. దీనితో పాటు రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో ‘డుంకి’ సినిమాను చేస్తున్నాడు.
Read Also:
Priyanka Arul Mohan | నాని హీరోయిన్‌కు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..!
Naga Shaurya | ఆ స్టార్ హీరో భార్య.. నాగశౌర్యకు పెద్ద ఫ్యాన్ అని మీకు తెలుసా..!
Liger Movie | ‘లైగర్’ చిత్రంతో పూరి జగన్నాధ్ అన్ని కోట్లు నష్టపోయాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

