God Father Movie | విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న మెగాస్టార్.. రూ.200 కోట్లు దాటిన ‘గాడ్‌ఫాదర్’ బిజినెస్
God Father Movie Business | మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఫుల్ జోష్‌తో సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ బిగెనింగ్‌లో ఏ స్పీడ్‌తో సినిమాలు చేసేవాడో.. ఇప్పుడు కూడా అదే స్పీడ్‌తో వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఇక చిరు ‘ఆచార్య’ వంటి భారీ ఫేయిల్యూర్ తర్వాత ‘గాడ్‌ఫాదర్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
God Father Movie Business | మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఫుల్ జోష్‌తో సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ బిగెనింగ్‌లో ఏ స్పీడ్‌తో సినిమాలు చేసేవాడో.. ఇప్పుడు కూడా అదే స్పీడ్‌తో వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఇక చిరు ‘ఆచార్య’ వంటి భారీ ఫేయిల్యూర్ తర్వాత ‘గాడ్‌ఫాదర్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ నుండి ఇటీవలే విడుదలైన టీజర్ వరకు ప్రతీది సినిమాపై అంతకంతకు అంచనాలను పెంచుతూనే ఉన్నాయి. మొహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ చిత్రానికి భారీగా నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. గాడ్‌ఫాదర్ మూవీ డిజిటల్ హక్కులు రూ.57కోట్లకు అమ్ముడయ్యాయట. తెలుగు, హిందీ వెర్షన్లను కలుపుకుని నెట్‌ఫ్లిక్స్ ఇంత భారీ మొత్తంలో ఓటీటీ రైట్స్‌ను కొనుగోలు చేసిందట. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో భాగమవడంతో అన్ని కోట్లకు డీల్ కుదిరించుకుందట. ఇక ఈ చిత్రానికి శాటిలైట్, ఆడియో హక్కుల రూపంలో మరో రూ.60కోట్ల వరకు బిజినెస్ జరిగిందట. దీన్ని బట్టి చూస్తే కేవలం నాన్-థియేట్రికల్ హక్కుల రూపంలోనే ఈ చిత్రానికి రూ.117 కోట్ల వరకు వచ్చాయి. ఇక ఈ సినిమా బిజినెస్ వాల్యూ కూడా దాదాపు రూ.90 కోట్లు ఉండనుందని సమాచారం. కాగా ఆచార్య వంటి భారీ ఫ్లాప్ వచ్చిన మెగాస్టార్ సినిమాకు ఈ రేంజ్లో బిజినెస్ జరగడం అంటే ఆయన క్రేజ్ ఎలాంటిదో తెలుస్తుంది.
ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన లూసీఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కింది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సల్మాన్‌ఖాన్ అతిధి పాత్రలో నటించగా సత్యదేవ్, నయనతార కీలకపాత్రలు పోషించారు. ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు. లేటెస్ట్గా విడుదలైన తార్ మార్ తత్తర్ మార్ సాంగ్‌కు ప్రేక్షకుల నుండ విశేష స్పందన వస్తుంది.
Read Also:
Jabardasth | రాకింగ్ రాకేష్‌తో పెళ్లి కన్ఫర్మ్ చేసిన జబర్దస్త్ లేడీ కమెడియన్..!
Dhamaka Movie | షూటింగ్ పూర్తి చేసుకున్న రవితేజ ‘ధమాకా’.. వైరల్ అవుతున్న వీడియో..!
Liger Movie | ‘లైగర్’ చిత్రంతో పూరి జగన్నాధ్ అన్ని కోట్లు నష్టపోయాడా?
Naga Shaurya | ఆ స్టార్ హీరో భార్య.. నాగశౌర్యకు పెద్ద ఫ్యాన్ అని మీకు తెలుసా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

