Dhamaka Movie | షూటింగ్ పూర్తి చేసుకున్న రవితేజ ‘ధమాకా’.. వైరల్ అవుతున్న వీడియో..!
Dhamaka Movie Shoot Wrapped Up | చాలా కాలం తర్వాత ‘క్రాక్’తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు రవితేజ. పాండమిక్‌లో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్ళను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఇక అదే స్పీడ్‌లో ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలను 5నెలల గ్యాప్‌లోనే విడుదల చేశాడు.
Dhamaka Movie Shoot Wrapped Up | చాలా కాలం తర్వాత ‘క్రాక్’తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు రవితేజ. పాండమిక్‌లో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్ళను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఇక అదే స్పీడ్‌లో ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలను 5నెలల గ్యాప్‌లోనే విడుదల చేశాడు. అయితే ఈ రెండు సినిమా ఫలితాలు రవితేజను తీవ్రంగా నిరాశపరిచాయి. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘ధమాకా’ సినిమాపైనే ఉన్నాయి. ‘నేను లోకల్’ త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ మరో అప్డేట్ను ప్రకటించారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. వీడియోలో షూటింగ్ పూర్తైన సందర్భంగా పటాకులు పేలుస్తూ సంబురాలు చేసుకున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ రానున్నట్లు వెల్లడించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవితేజకు జోడీగా పెళ్ళి సందడి ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, ప్రసన్న కుమార్ బెజవాడ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందిస్తున్నాడు.
#Dhamaka shoot completed.@RaviTeja_offl @sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla@KumarBezwada @PrawinPudi @ceciroleo @Srinagendra_Art @OfficialSekhar @SunilOfficial @srinu10477 @sujithkolli @peoplemediafcy @AAArtsofficial @UrsVamsiShekar @mammadu91 pic.twitter.com/9W2hi3SV9G
— Sreedhar Sri (@SreedharSri4u) September 21, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

