Jabardasth | రాకింగ్ రాకేష్‌తో పెళ్లి కన్ఫర్మ్ చేసిన జబర్దస్త్ లేడీ కమెడియన్..!
Jabardasth Raking Rakesh | జబర్దస్త్ కామెడీ షో చూస్తుంటే చాలామంది రిలేషన్ లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగే ప్రమోషన్స్ అలాగే ఉంటాయి. వాళ్ళ రేటింగ్ కు తగ్గట్లు ఎవరెఎవరిని కలిపితే బాగుంటుందో చూసి వాళ్లను జత చేసి ప్రోమోలను విడుదల చేస్తుంటారు నిర్వాహకులు.
Jabardasth Raking Rakesh | జబర్దస్త్ కామెడీ షో చూస్తుంటే చాలామంది రిలేషన్ లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగే ప్రమోషన్స్ అలాగే ఉంటాయి. వాళ్ళ రేటింగ్ కు తగ్గట్లు ఎవరెఎవరిని కలిపితే బాగుంటుందో చూసి వాళ్లను జత చేసి ప్రోమోలను విడుదల చేస్తుంటారు నిర్వాహకులు. అలా వచ్చిన వాటిలో రష్మీ గౌతమ్, సుడిగాలి సుదీర్ మధ్య ఏదో నడుస్తుంది అని చాలా సంవత్సరాలుగా వినిపిస్తూనే ఉంది. అయితే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే.. ఎలాంటి రిలేషన్ లేదు అంటూ చాలామంది ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. జబర్దస్త్ లో కనిపించేదంతా కేవలం రేటింగ్ కోసం ఆడుతున్న నాటకాలు మాత్రమే.. అందులో ఎలాంటి రియాలిటీ ఉండదని చెబుతూనే ఉంటారంతా.
కాకపోతే జబర్దస్త్ కామెడీ షో చరిత్రలోనే మొదటి సారి ఒక జోడి నిజంగానే ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళు ఎవరో కాదు.. రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత. రెండేళ్ల కింద వీళ్ళు మొదటిసారి జబర్దస్త్ లో కలిశారు. అప్పటినుంచి తన స్కిట్లో సుజాతకు అవకాశం ఇస్తున్నాడు రాకేష్. అంతకుముందు పిల్లలతో స్కిట్లు చేసిన ఈయన.. ఆ తర్వాత సుజాతతో పాటు మరికొందరు లేడీ కమెడియన్స్ తో కలిసి స్కిట్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే సుజాతతో ఆయన ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది అంటూ తాము కూడా చాలాసార్లు బయట ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఎప్పుడు చెప్పలేదు.. కానీ తొలిసారి తన యూట్యూబ్ ఛానల్ లో రాకింగ్ రాకేష్ తో పెళ్లి గురించి అధికారికంగా బయట పెట్టింది జబర్దస్త్ సుజాత.
రోజా హౌస్ టూర్ లో భాగంగా మాట్లాడుతూ.. తమ రిలేషన్ గురించి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. త్వరలోనే పెళ్లి గురించి మరిన్ని వివరాలు చెప్తాను అంటూ క్లారిటీ ఇచ్చింది సుజాత. అందులో రాకింగ్ రాకేష్ కూడా ఉన్నాడు. త్వరలోనే ఇద్దరి పెళ్లి గురించి మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. ఏదేమైనా జబర్దస్త్ షో నుంచి ఒక జంట పెళ్లి పీటలు ఎక్కనుండడంతో మిగిలిన వారు సంతోషపడుతున్నారు.
Read Also:
Dhamaka Movie | షూటింగ్ పూర్తి చేసుకున్న రవితేజ ‘ధమాకా’.. వైరల్ అవుతున్న వీడియో..!
Liger Movie | ‘లైగర్’ చిత్రంతో పూరి జగన్నాధ్ అన్ని కోట్లు నష్టపోయాడా?
Doctor-G Movie | గైనకాలజిస్ట్‌గా ఆయుష్మాన్ ఖురానా.. నవ్వులు పూయిస్తున్న ‘డాక్టర్-G’ ట్రైలర్
God Father Movie | ‘గాడ్‌ఫాదర్’ మూవీ బిజినెస్ వాల్యూ అన్ని కోట్లా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

