God Father Movie | ‘గాడ్‌ఫాదర్’ మూవీ బిజినెస్ వాల్యూ అన్ని కోట్లా?
God Father Movie Theatrical Business | రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి ఫుల్ జోష్‌తో సినిమాలు చేస్తున్నాడు. ఫలితం ఎలా ఉన్నా వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ‘ఆచార్య’ వంటి భారీ ఫేయిల్యూర్ తర్వాత ‘గాడ్‌ఫాదర్’తో చిరు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
God Father Movie Theatrical Business | రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి ఫుల్ జోష్‌తో సినిమాలు చేస్తున్నాడు. ఫలితం ఎలా ఉన్నా వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ‘ఆచార్య’ వంటి భారీ ఫేయిల్యూర్ తర్వాత ‘గాడ్‌ఫాదర్’తో చిరు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ నుండి ఇటీవలే విడుదలైన టీజర్ వరకు ప్రతీది సినిమాపై అంతకంతకు అంచనాలను పెంచుతూనే ఉన్నాయి. మొహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ గురించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
‘గాడ్‌ఫాదర్’ మూవీ ఫైనల్ అవుట్ పుట్‌పై మేకర్స్ ఆనందంగా ఉన్నారట. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ గాడ్‌ఫాదర్ చిత్రాన్ని ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారట. అంతేకాకుండా ఆచార్య ఫలితం తేడా కొట్టడంతో డిస్ట్రీబ్యూటర్లు తక్కువ రేటుకు రైట్స్‌ను అడుగుతున్నారని టాక్. అయితే మేకర్స్ మాత్రం మూవీ అవుట్ పుట్‌పై ఉన్న నమ్మకంతో తక్కువ ధరకు థియేటర్ రైట్స్‌ను అమ్మడం ఇష్టం లేదట. దాంతో సినిమాను సొంతగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇక గాడ్‌ఫాదర్ బిజినెస్ వాల్యూ సుమారు రూ.90 కోట్ల వరకు ఉండనుందట. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కోసం రూ.95 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. ఇక ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోనూ విడుదల చేయనున్నారు.
గాడ్‌ఫాదర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ మంగళవారం నుండి ప్రమోషన్స్ షూరు చేయనున్నారు. ఇక నాన్ స్టాప్‌గా రిలీజ్‌కు ముందు రోజు వరకు ప్రమోషన్స్ చేస్తారట. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన లూసీఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కింది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సల్మాన్‌ఖాన్ అతిధి పాత్రలో నటించగా సత్యదేవ్, నయనతార కీలకపాత్రలు పోషించారు. ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు.
Read Also:
NBK107 | భారీ ధరకు బాలకృష్ణ ‘NBK107’ నాన్-థియేట్రికల్ హక్కులు.. వామ్మో అన్ని కోట్లా?
Naga Shaurya | ఆ స్టార్ హీరో భార్య.. నాగశౌర్యకు పెద్ద ఫ్యాన్ అని మీకు తెలుసా..!
Priyanka Arul Mohan | నాని హీరోయిన్‌కు బంపర్ ఆఫర్.. ఏకంగా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..!
Ye Maaya Chesave Movie | ‘ఏమాయ చేశావే’ మూవీని ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

