NBK107 | భారీ ధరకు బాలకృష్ణ ‘NBK107’ నాన్-థియేట్రికల్ హక్కులు.. వామ్మో అన్ని కోట్లా?
NBK107 Non-Theatrical Rights | చాలా కాలం తర్వాత 'అఖండ'తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం అదే జోష్‌తో తన తదుపరి సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో పొలిటికల్ టచ్ ఉన్న మాస్ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు.
NBK107 Non-Theatrical Rights | చాలా కాలం తర్వాత ‘అఖండ’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం అదే జోష్‌తో తన తదుపరి సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో పొలిటికల్ టచ్ ఉన్న మాస్ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపిచంద్ మలినేని.. బాలకృష్ణతో సినిమా చేయనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన బాలయ్య పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా అని అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ చిత్రానికి భారీగా నాన్-థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. దాదాపు రూ.60 కోట్లకు ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు అమ్ముడు పోయాయట. అఖండ సక్సెస్‌తో ఈ సినిమాకు భారీ రేంజ్లో బిజినెస్ జరగుతుందట. ఇక థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.70 కోట్ల వరకు జరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే బయ్యర్ల నుండి ఫ్యాన్సీ రేటుతో ఆఫర్స్ వస్తున్నాయిట. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.
ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఎస్ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకు ‘జై బాలయ్య’ అనే టైటిల్ దాదాపు కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తుంది. దీని తర్వాత బాలకృష్ణ, అనీల్ రావిపూడితో ఓ యాక్షన్ సినిమా చేయనున్నాడు. ఫాదర్-డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ‘పెళ్ళిసందD’ ఫేం శ్రీలీలా, బాలకృష్ణకు కూతురిగా నటిస్తుంది.
Read Also:
Thiru Movie | ఓటీటీలోకి ధనుష్ ‘తిరు’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Sir Movie | ‘సార్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ టాలీవుడ్ హీరోతో పోటీపడనున్న ధనుష్..!
God Father Movie | ‘గాడ్‌ఫాదర్’ ఓటీటీ ప్లాట్ఫార్మ్ ఇదేనా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

