Sir Movie | ‘సార్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ టాలీవుడ్ హీరోతో పోటీపడనున్న ధనుష్..!
Dhanush's Sir Movie Release Date Announced | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న నటులలో ధనుష్ ఒకడు. ‘రఘువరన్ B-Tech’ తో టాలీవుడ్లో ఈయనకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ చిత్రం తర్వాత ధనుష్ నటించిన సినిమాలన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతున్నాయి.
Dhanush’s Sir Movie Release Date Announced | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న నటులలో ధనుష్ ఒకడు. ‘రఘువరన్ B-Tech’ తో టాలీవుడ్లో ఈయనకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ చిత్రం తర్వాత ధనుష్ నటించిన సినిమాలన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ధనుష్ ఐదు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ‘సార్’ సినిమా ఒకటి. ద్విభాష చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘రంగ్‌దే’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.
‘సార్’ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టైబుల్‌పై కూర్చొని స్టూడెంట్స్‌ను క్లాస్ పీకుతున్నట్లు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ధనుష్ జూనియర్ లెక్చరర్‌గా కనిపించనున్నాడు. ధనుష్‌కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుంది. జీవి. ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే అదే రోజున అడివిశేష్ ‘హిట్-2’ కూడా విడుదల కానుంది. ఇక ప్రస్తుతం ధనుష్ ‘తిరు సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. గత నెలలో విడుదలైన ఈ చిత్రం ధనుష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఈయన నటించిన ‘నానే వరువెన్’ విడుదలకు సిద్ధంగా ఉంది.
Read Also:
VT13 | యుద్ధ విమానాల మధ్యలో వరుణ్‌తేజ్.. ఆసక్తిరేకెత్తిస్తున్న ‘VT13’ ప్రీ లుక్ పోస్టర్
God Father Movie | ‘గాడ్‌ఫాదర్’ ఓటీటీ ప్లాట్ఫార్మ్ ఇదేనా?
Ye Maaya Chesave Movie | ‘ఏమాయ చేశావే’ మూవీని ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

