VT13 | యుద్ధ విమానాల మధ్యలో వరుణ్‌తేజ్.. ఆసక్తిరేకెత్తిస్తున్న ‘VT13’ ప్రీ లుక్ పోస్టర్
VT13 Movie Annoncement | మెగా ట్యాగ్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన నటన, స్క్రిప్ట్ సెలక్షన్‌తో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్‌తేజ్. విభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు.
VT13 Movie Annoncement | మెగా ట్యాగ్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన నటన, స్క్రిప్ట్ సెలక్షన్‌తో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్‌తేజ్. విభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాలన్ని ఏ ఒక్క దానికి సంబంధంలేకుండా విభిన్నంగా ఉన్నాయి. ఈ ఏడాది ‘గని’తో మెగాఫ్యాన్స్‌ను నిరాశపరిచిన వరుణ్.. ఆ తర్వాత వెంటనే ‘ఎఫ్-3’తో తిరిగి ట్రాక్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం ఈయన ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమాను చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఇదిలా ఉంటే తాజాగా వరుణ్ మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళాడు.
వరణ్‌తేజ్ తాజాగా తన 13వ సినిమాను ప్రకటించాడు. షార్ట్ ఫిలిం దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో వరుణ్ ఏయిర్ వింగ్ కమాండర్‌గా కనిపించనున్నాడు. తాజాగా విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యుద్ధ విమానాల మధ్యలో వరుణ్‌తేజ్ నిల్చుని ఉన్న ఈ పోస్టర్ ఆసక్తిరేకెత్తిస్తుంది. నిజమైన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రెన్నాయ్సెన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరపుకుంటుంది.
Bravery that knows no bounds, celebrating the valour of
Indian Air Force.
Get ready to witness the battle in the skies on the big screen,
taking off soon! 🇮🇳#VT13 pic.twitter.com/QvSJL62DRf— Varun Tej Konidela (@IAmVarunTej) September 19, 2022
Read Also:
Shankar | శంకర్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్?
SSMB29 | మహేష్-రాజమౌళి సినిమాలో హీరోయిన్లుగా ఆ ఇద్దరు బాలీవుడ్ భామలు?
Ye Maaya Chesave Movie | ‘ఏమాయ చేశావే’ మూవీని ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా?
God Father Movie | ‘గాడ్‌ఫాదర్’ ఓటీటీ ప్లాట్ఫార్మ్ ఇదేనా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

