Shankar | శంకర్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్?
Shankar Hands With Rocking Star Yash | 'కేజీఎఫ్' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు యష్. కన్నడ హీరోలకు అంతగా గుర్తింపు లేని టైంలో భాషతో సంబంధంలేకుండా దేశ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. ముఖ్యంగా దక్షిణాదిలో ఈయన క్రేజ్ బాలీవుడ్ స్టార్ హీరోలకు సమానంగా ఉంది.
Shankar Hands With Rocking Star Yash | ‘కేజీఎఫ్’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు యష్. కన్నడ హీరోలకు అంతగా గుర్తింపు లేని టైంలో భాషతో సంబంధంలేకుండా దేశ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. ముఖ్యంగా దక్షిణాదిలో ఈయన క్రేజ్ బాలీవుడ్ స్టార్ హీరోలకు సమానంగా ఉంది. ప్రస్తుతం ఈయన ‘మఫ్టీ’ ఫేం నార్తన్‌తో నెక్స్ట్ చిత్రాన్ని చేయబోయతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇదిలా ఉంటే యష్ తదుపరి సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఇండియా గర్వించదగ్గ దర్శకులలో శంకర్ ఒకడు. హీరోలతో సంబంధంలేకుండా కేవలం పోస్టర్‌పైన ఈయన పేరు ఉంటే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. ప్రస్తుతం ఈయన రామ్‌చరణ్‌తో ‘Rc15’, కమల్ హాసన్‌తో ‘భారతీయుడు-2’ తెరకెక్కిస్తున్నాడు. ఈయన దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని ఎంతో మంది స్టార్ హీరోలు కోరకుంటుంటారు. అయితే తాజాగా ఆ అదృష్టం యష్‌కు తగిలినట్లు తెలుస్తుంది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం శంకర్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ ఓ భారీ మూవీని చేస్తున్నట్లు టాక్. ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో నెట్‌ఫ్లిక్స్ అండ్ కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించనున్నారట. శంకర్ తన కమిట్మెంట్లను పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Read Also:
Suriya41 Movie | సూర్య-బాలా మూవీ ఓటీటీలో విడుదల కానుందా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
Adipurush Movie | ‘ఆదిపురుష్’లో సోనాల్ చౌహన్ ఆయనకు భార్యగా నటించిందా?
Kabza Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కబ్జా’ టీజర్.. ‘కేజీఎఫ్’ను మించేలా ఉందిగా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

