God Father Movie | ‘గాడ్‌ఫాదర్’ ఓటీటీ ప్లాట్ఫార్మ్ ఇదేనా?
God Father Movie OTT Platform | 'ఆచార్య'తో భారీ ఫ్లాప్‌ను అందుకున్న చిరు.. 'గాడ్‌ఫాదర్'తో ఎలాగైనా భారీ హిట్‌ను సాధించాలి అని కసితో ఉన్నాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. ఇక ఈ చిత్రానికి భారీ స్థాయిలో ఓటీటీ డీల్ జరిగనట్లు తెలుస్తుంది.
God Father Movie OTT Platform | ‘ఆచార్య’ వంటి భారీ ఫేయిల్యూర్ తర్వాత ‘గాడ్‌ఫాదర్’తో చిరు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ నుండి ఇటీవలే విడుదలైన టీజర్ వరకు ప్రతీది సినిమాపై అంతకంతకు అంచనాలను పెంచుతూనే ఉన్నాయి. మొహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ అప్డేట్ బయటకు వచ్చింది.
‘గాడ్‌ఫాదర్’ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో నటించడంతో భారీ స్థాయిలో ఓటీటీ డీల్ జరిగిందని సమాచారం. ఈ చిత్రం థియేటర్లో విడుదలైన 50రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవలే చిత్రం నుండి విడుదలైన తార్ మార్ తక్కర్ మార్ సాంగ్‌కు విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన లూసీఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కింది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సల్మాన్‌ఖాన్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా సత్యదేవ్, నయనతార కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Read Also:
Ye Maaya Chesave Movie | ‘ఏమాయ చేశావే’ మూవీని ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడా?
తగ్గేదేలే.. మరో పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న ది లెజెండ్ శరవణన్ !!
Shaakuntalam Movie | సమంత ‘శాకుంతలం’ నుండి ‘దుష్యంతుడి’ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్..!
SSMB29 | మహేష్-రాజమౌళి సినిమాలో హీరోయిన్లుగా ఆ ఇద్దరు బాలీవుడ్ భామలు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

