Shaakuntalam Movie | సమంత ‘శాకుంతలం’ నుండి ‘దుష్యంతుడి’ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్..!
Shaakuntalam Movie Dushyant Poster | 'బాహుబలి' తర్వాత తెలుగు సినిమాలకు జాతీయ స్థాయిలో ఆధరణ వస్తుంది. ఈ క్రమంలోనే పలు మీడియం, భారీ బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నాయి. ఈ క్రమంలోనే సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'శాకుంతలం' కూడా పాన్ ఇండియా సినిమాగానే తెరకెక్కతుంది.
Shaakuntalam Movie Dushyant Poster | ‘బాహుబలి’ తర్వాత తెలుగు సినిమాలకు జాతీయ స్థాయిలో ఆధరణ వస్తుంది. ఈ క్రమంలోనే పలు మీడియం, భారీ బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నాయి. ఈ క్రమంలోనే సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శాకుంతలం’ కూడా పాన్ ఇండియా సినిమాగానే తెరకెక్కతుంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసింది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన సమంత ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ యువ నటుడు దేవ్ మోహన్ కీలకపాత్రలో నటించాడు. తాజాగా ఈయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఆదివారం దేవ్ మోహన్ బర్త్‌డే సందర్భంగా ఈయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో కనిపించనున్నాడు. గుర్రంపై యుద్ధ వీరుడిగా ఇంటన్సీవ్ లుక్స్‌తో పోస్టర్లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కుమార్తె అల్లుఅర్హ కీలకపాత్రలో నటించింది. దిల్‌రాజు సమర్పణలో గుణ టీంవర్క్స్ బ్యానర్‌పై నీలిమాగుణ నిర్మిస్తుంది. అత్యంత భారీగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వచ్చే ఈ ఏడాది ద్వితియార్థంలో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మెలోడీ కింగ్ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రుద్రమదేవీ తర్వాత గుణశేఖర్ దాదాపు ఏడేళ్ళు టైం తీసుకుని శాకుంతలం చిత్రాన్ని తెరకెక్కించాడు.
Wishing our ever-charming, valiant and handsome King #Dushyant, @ActorDevMohan a very Happy Birthday! ⚔️🤍#Shaakuntalam @Gunasekhar1 @Samanthaprabhu2 #ManiSharma @neelima_guna @GunaaTeamworks @DilRajuProdctns @SVC_official @tipsofficial #MythologyforMilennials #EpicLoveStory pic.twitter.com/pfAvfLUWnq
— Gunaa Teamworks (@GunaaTeamworks) September 18, 2022
Read Also:
SSMB29 | మహేష్-రాజమౌళి సినిమాలో హీరోయిన్లుగా ఆ ఇద్దరు బాలీవుడ్ భామలు?
Shankar | శంకర్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్?
Suriya41 Movie | సూర్య-బాలా మూవీ ఓటీటీలో విడుదల కానుందా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
Adipurush Movie | ‘ఆదిపురుష్’లో సోనాల్ చౌహన్ ఆయనకు భార్యగా నటించిందా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

