తగ్గేదేలే.. మరో పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న ది లెజెండ్ శరవణన్ !!
The Legend Saravanan | హీరో కావాలన్న తన చిరకాల వాంఛను ది లెజెండ్ సినిమాతో తీర్చుకున్నాడు శరవణ స్టోర్స్ అధినేత శరవణన్. ఐదు పదుల వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించాడు.
The Legend Saravanan | హీరో కావాలన్న తన చిరకాల వాంఛను ది లెజెండ్ సినిమాతో తీర్చుకున్నాడు శరవణ స్టోర్స్ అధినేత శరవణన్. ఐదు పదుల వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించాడు. ఈ ఒక్క సినిమాతో శరవణ స్టోర్స్ శరవణన్ కాస్త లెజెండ్ శరవణన్‌గా మారిపోయాడు. రూ.60 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ది లెజెండ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. శరవణన్‌కు భారీ నష్టాలను తీసుకొచ్చింది.
సినిమా బిజినెస్ మాట పక్కనపెడితే శరవణన్‌పై చాలా ట్రోల్స్ వచ్చాయి. హీరోగా కాదు కదా కనీసం సైడ్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా పనికిరావంటూ నెటిజన్లు ఎద్దేవా చేశారు. ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేస్తూ సోషల్‌మీడియాలో చాలా ట్రోల్స్ తిరిగాయి. ఇవన్నీ చూసిన తర్వాత మళ్లీ సినిమాల మాట ఎత్తకపోవచ్చని అంతా అనుకున్నారు. ఎలాగూ హీరో కావాలన్న తన కోరిక నెరవేరింది కాబట్టి బుద్ధిగా తన బిజినెస్‌లు చూసుకుంటాడని భావించారు. కానీ తనను విమర్శించిన అందరికీ షాకిస్తూ లెజెండ్ శరవణ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మరో సినిమా చేసేందుకు సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది.
రొమాంటిక్ డ్రామా జోనర్లో శరవణన్ తన రెండో సినిమా చేయబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే ఓ కొత్త దర్శకుడితో శరవణన్ చర్చలు జరిపాడని.. కథ కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్‌గా అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో నిర్మించనున్నట్లు సమాచారం. ది లెజెండ్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలాను తీసుకున్న శరవణన్.. తన రెండో సినిమా కోసం ఓ స్టార్ హీరోయిన్ను రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.
Read More :
సీతారామం సినిమాకు సీక్వెల్ ఉంటుందా? దుల్కర్ చెప్పిన సమాధానమిదే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

