ప్రభాస్‌తో ఆ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నా.. ఫస్ట్ డే ఫస్ట్ షో హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Sanchita Bashu | సోషల్ మీడియా సూపర్ స్టార్ సంచితా బసు. టిక్‌టాక్‌తో పరిచయమై.. టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా ద్వారా వెండితెరపై మెరిసిన ఈ అందాల భామ.. ఇండస్ట్రీని ఏలేయాలని అనుకుంటున్నది.
Sanchita Bashu | సోషల్ మీడియా సూపర్ స్టార్ సంచితా బసు. టిక్‌టాక్‌తో పరిచయమై.. టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా ద్వారా వెండితెరపై మెరిసిన ఈ అందాల భామ.. ఇండస్ట్రీని ఏలేయాలని అనుకుంటున్నది. అల్లు అర్జున్ తన అభిమాన హీరో అని చెబుతున్నది. ప్రభాస్‌తో నటించే రోజు కోసం ఎదురుచూస్తున్నది..
మాది బిహార్‌లోని భగల్పూర్. ఊహ తెలిసినప్పటినుంచీ చాలా అల్లరి చేసేదాన్ని. నవ్వుతూ, నవ్విస్తూ చలాకీగా ఉండేదాన్ని. స్కూల్ డేస్‌లోనే సోషల్ మీడియాకు దగ్గరైపోయాను.
క్లాసులో ఎప్పుడూ ఫస్టే. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నా. సినిమాల్లో నటిస్తూనే చదువునూ కొనసాగిస్తా.
ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనే నన్ను సోషల్ మీడియా వైపు నడిపించింది. ఆ ప్రయత్నంలో ‘టిక్‌టాక్’ ఎంచుకున్నా. వీడియోస్ చేయడం ప్రారంభించా. తొలినాళ్లలో అంత ఆదరణ దక్కలేదు. అయినా నిరాశపడకుండా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నా. మూణ్నెల్లు తిరిగేసరికి నన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య పది లక్షలకు చేరింది. మరికొద్ది రోజుల్లోనే ఆ సంఖ్య ముప్పై లక్షల మైలురాయిని అధిగమించింది.

నా స్టార్డమ్ మంచి పీక్‌లో ఉన్న సమయంలో మనదేశంలో టిక్‌టాక్‌ను బ్యాన్ చేశారు. నా కలల మేడను ఎవరో కూల్చేసినట్టు అనిపించింది. ఆ బాధ తాత్కాలికమే. ఇది కాకపోతే, ఇంకా అనేక మార్గాలు ఉన్నట్టు తెలిసింది. స్నాక్ వీడియో, మోజో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్.. ఇలా అన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా నా అభిమానులను పలకరించాను. అతి తక్కువ సమయంలోనే పాత వైభవాన్ని సొంతం చేసుకున్నాను.
అందం, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. నిత్యం యోగా చేస్తాను. వ్యాయామం నా జీవితంలో భాగం. డ్యాన్స్ అంటే ఇష్టం. ఏమాత్రం ఖాళీ దొరికినా ఏదో ఓ కొత్త ప్రదేశానికి వెళ్తాను. మనసారా షాపింగ్ చేస్తాను. ధనుష్, అల్లు అర్జున్ నా అభిమాన హీరోలు. ప్రభాస్‌తో నటించే అవకాశం వస్తే ‘ఎస్’ చెబుతా. ప్రస్తుతం కొత్తకొత్త కథలు వింటున్నా. ఇంకా దేనికీ ఓకే చెప్పలేదు.
సోషల్ మీడియాలో నేను షేర్ చేసిన వీడియోలు చూసే, దర్శకుడు అనుదీప్ నన్ను ఆడిషన్‌కు పిలిచారు. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ద్వారా తొలిసారిగా వెండితెర అభిమానులకు పరిచయం అయ్యాను. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి నన్ను ప్రశంసించారు. అంతేకాదు, నా కళ్లనూ మెచ్చుకోవడం మర్చిపోలేని జ్ఞాపకం.
Read More :
Sanchita Bashu | ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ ఇంటర్వ్యూలో సంచిత బాషు..”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

