సీతారామం సినిమాకు సీక్వెల్ ఉంటుందా? దుల్కర్ చెప్పిన సమాధానమిదే..
Dulquer Salmaan About Sita Ramam Sequel | దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన తాజా చిత్రం సీతారామం. ఇటీవల విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. క్లాసిక్‌గా నిలిచింది.
Dulquer Salmaan About Sita Ramam Sequel | మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు దుల్కర్ సల్మాన్. మమ్మూటీ వారసుడిగా మలయాళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకున్నాడు. విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. కేవలం మలయాళంలోనే కాకుండా అప్పుడప్పుడు ఇతర భాషల సినిమాల్లోనూ నటిస్తూ అక్కడ కూడా ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఈయన తెలుగులో నటించిన తాజా చిత్రం సీతారామం. ఇటీవల విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. క్లాసిక్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు. ఇదే ప్రశ్న దుల్కర్ సల్మాన్‌కు ఎదురుకావడంతో ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు.
నేను సినిమాల్లోకి రాకముందే ఈ విషయంలో ఒక నిర్ణయానికొచ్చా. ఆడియన్స్ మెప్పు పొంది.. క్లాసిక్‌గా నిలిచిన సినిమాలను అస్సలు టచ్ చేయకూడదని డిసైడ్ అయ్యా. అందుకే సీక్వెల్స్, రీమేక్స్ జోలికి వెళ్లకూడదని అనుకున్నా. సీతారామం మంచి విజయాన్ని అందుకుని క్లాసిక్ సినిమాగా నిలిచింది. ఇటువంటి చిత్రాన్ని మళ్లీ టచ్ చేయకూడదని నా అభిప్రాయం. కాబట్టే సీతారామం సినిమాకు సీక్వెల్ ఉండదనే అనుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు దుల్కర్ సల్మాన్.
హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా ఆగస్టు 5వ తేదీ విడుదలైన ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించగా.. సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ మెప్పించింది. రష్మిక మంధన, సుమంత్, తరుణ్ భాస్కర్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలో నటించారు. వైజయంతీ మూవీస్ ఈ సినిమాను నిర్మించింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సీతారామం సినిమా అక్కడ కూడా సంచలన విజయాన్ని అందుకుంది.
Read More :
“Mrunal Thakur | సినిమా చూసి మారిపోయారు..!”
“Dulquer Salmaan | దుల్కర్ సల్మాన్ ఫేవరేట్ తెలుగు హీరో ఇతడేనట..!”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

