జెర్సీ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా..ఆ వెంటనే సీతారామం సినిమాతో మంచి బ్రేక్ అందుకుంది బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur). ఈ బ్యూటీ సీతారామం సినిమాలో సంప్రదాయ చీరకట్టులో తెలుగుదనం ఉట్టిపడేలా ఆకట్టుకునే అందంతో మెస్మరైజ్ చేసింది. అందం, అభినయంతో కోట్లాదిమంది మనసు దోచేసింది మృణాళ్ ఠాకూర్. ఈ బ్యూటీఫుల్ లేడీకి ఓ లెజెండరీ నటి బయోపిక్‌లో నటించాలని ఉందట.
సీతారామం (Sita Ramam) షూటింగ్ మొదలైనపుడు అందరూ మృణాళ్ ఠాకూర్‌ను లెజెండరీ నటి మధుబాల (Madhubala)తో పోల్చడం మొదలుపెట్టారు. తనను మధుబాలతో పోల్చడం గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పింది మృణాళ్ ఠాకూర్. ఐకానిక్ హీరోయిన్ మధుబాల పాత్ర పోషించడం కష్టం…తాను ఆ కష్టం పడేందుకు (బయోపిక్‌లో నటించేందుకు) వెయిట్ చేస్తున్నానని మృణాళ్ ఠాకూర్ చెప్పింది.
హను రాఘవపూడి డైరెక్షన్లో వచ్చిన సీతారామం సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్న మృణాళ్ ఠాకూర్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. ఈ భామ పిప్పా, ఆంఖ్ మిచోలి, గుమ్రా, పూజా మేరీ జాన్ చిత్రాల్లో నటిస్తోంది.