Doctor-G Movie | గైనకాలజిస్ట్‌గా ఆయుష్మాన్ ఖురానా.. నవ్వులు పూయిస్తున్న ‘డాక్టర్-G’ ట్రైలర్
Doctor-G Movie Trailer | వాస్తవికతను ప్రతిబింబించే కథాంశాల్ని ఎంచుకుంటూ బాలీవుడ్ సినీరంగంలో హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు ఆయుష్మాన్ ఖురానా. ఫలితంతో సంబంధంలేకుండా ప్రేక్షకులకు కొత్త కథలను పరిచయం చేస్తుంటాడు.
Doctor-G Movie Trailer | వాస్తవికతను ప్రతిబింబించే కథాంశాల్ని ఎంచుకుంటూ బాలీవుడ్ సినీరంగంలో హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు ఆయుష్మాన్ ఖురానా. ఫలితంతో సంబంధంలేకుండా ప్రేక్షకులకు కొత్త కథలను పరిచయం చేస్తుంటాడు. ఈయన మొదటి నుండి కంటెంట్ ఉన్న సినిమాలనే చేస్తూ వస్తున్నాడు. ఇక ఇటీవలే ఈయన నటించిన ‘అనేక్’ బాక్సాఫీస్ దగ్గర భారీ ఫేయిల్యూర్‌గా మిగిలింది. కమర్షియల్‌గా ఈ చిత్రం ఆయుష్మాన్ ఖురానాకు కెరీర్ బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈయన నటించిన ‘డాక్టర్-G’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
లేటెస్ట్గా విడుదలైన ‘డాక్టర్-G’ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టకుంటుంది. ఎమ్బీబీఎస్లో చేరిన ఆయుష్మాన్ ఖురానా ఆర్థో పెడిక్స్ చదవాలనుకుంటాడు. కానీ తనకు గైనకాలజీను కేటాయిస్తారు. అయితే సాధారణంగా గైనకాలజిస్ట్లు మహిళలే ఎక్కువగా ఉంటారు. దాంతో మహిళా వైద్యులతో, స్టూడెంట్స్‌తో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ట్రైలర్ మొత్తం హాస్యాస్పదంగా ప్రేక్షకులను ఆలోచింపజేసే అంశంగా సాగింది. ఈ చిత్రంలో ఆయుష్మాన్‌కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 14న విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

